Punjab Election : రేపే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం -ఆప్

మంగళవారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పేరును వెల్లడిస్తామన్నారు...

Punjab Election : రేపే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం -ఆప్

Punjab Aap

Punjab AAP CM Candidate : పంజాబ్ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిన్న రాష్ట్రాల వైపు దృష్టి సారించిన ఈ పార్టీ అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ..కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలంటూ..ఏకంగా ఓ ఫోన్ నెంబర్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. సీఎంగా ఎవరైతే బెటర్ అని ఆలోచించి…7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పాలన్నారు. వాట్సాప్ లో మేసేజ్ ద్వారా అభిప్రాయం చెప్పే అవకాశం ఉందన్నారు.

Read More : Punjab Elections Postponed  : పంజాబ్ ఎన్నికలు వాయిదా..ఫిబ్రవరి 20కు వాయిదా వేసిన ఈసీ

2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఈ క్రమంలో…2022, జనవరి 18వ తేదీ మంగళవారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పేరును వెల్లడిస్తామన్నారు. పార్టీ ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకున్నా…ప్రజల నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు…ఫిబ్రవరి 20కు పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరటంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్ర‌వ‌రి 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Read More : Telangana Covid : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేనట్లే ?

మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించి..అధికారంలోకి వచ్చింది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. ఆ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 59 స్థానాలు కావాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 80 స్థానాలు, ఆప్‌కు 17, బీజేపీకి రెండు స్థానాలున్నాయి. మిగిలిన వాటిలో ఇతరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మొత్తం అసెంబ్లీ స్థానాలు 117
మ్యాజిక్ ఫిగర్ 59
ప్రస్తుతం కాంగ్రెస్‌కు 80 సీట్లు
ఆప్‌ -17
బీజేపీ -2