Rahul Gandhi: అప్పుడు హిండెన్‭బర్గ్.. ఇప్పుడు ఓసీసీఆర్పీ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

అదానీ సంస్థలు అవినీతికి పాల్పడ్డట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయం అంతర్జాతీయంగా..

Rahul Gandhi: అప్పుడు హిండెన్‭బర్గ్.. ఇప్పుడు ఓసీసీఆర్పీ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

Rahul Gandhi

Updated On : August 31, 2023 / 7:08 PM IST

Rahul Gandhi – Adani Group: పారిశ్రామిక వేత్త అదానీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంపై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అదానీ ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు.

సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరపడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీతో విచారణ జరపాలని అన్నారు. అదానీ సంస్థలు అవినీతికి పాల్పడ్డట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయం అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని అన్నారు. అదానీ వ్యవహారంపై విచారణ జరపాల్సిందేనని చెప్పారు.

భారత్ లో జీ 20 సమావేశాలు జరుగుతున్నాయని, ఆయా దేశాధినేతలు వస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని మోదీ వ్యవహరించాలని అన్నారు. కాగా, కొన్ని నెలల క్రితం హిండెన్‭బర్గ్ రిపోర్ట్ సృష్టించిన అలజడిని మరవకముందే ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైం అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ (ఓసీసీఆర్పీ) రిపోర్టు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదానీ వ్యవహారంపై కనీసం ఇప్పుడైనా విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

INDIA 3rd Meet: బెంగళూరులో అలా.. ముంబైలో ఇలా.. విపక్షాల సమావేశాల్లో నితీశ్ కుమార్‭కు వింత అనుభవాలు