కాంగ్రెస్ నేతపై రాహుల్ ఫైర్ : దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే

కాంగ్రెస్ నేతపై రాహుల్ ఫైర్ : దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే
ad

1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,2019)పంజాబ్ లోని ఫతేఘర్ సాహిబ్ లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ….తాను పోన్ లో కూడా పిట్రోడాకు ఇదే విషయం చెప్పానని అన్నారు.ఆయన తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని,బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ అన్నారు. సిక్కు అల్లర్ల నిందుతులు శిక్ష అనుభవించాల్సిందేనని రాహుల్ అన్నారు.

సిక్కుల ఉచకోతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ అయిన శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.1984 లో జరిగిన సిక్కుల ఉచకోత ఆదేశాలు అప్పటి ప్రధానిగాఉన్న రాజీవ్ గాంధీ కార్యాలయం నుండే వచ్చాయని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రయివేట్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో శ్యామ్ పింట్రోడా మట్లాడుతూ… అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి?అని మాట్లాడారు.శ్యామ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే.ఆ వ్యాఖ్యలతో పార్టీతో ఎలాంటి సంబంధం లేదని,ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపింది.