Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు?: పార్లమెంటులో రాహుల్

''ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు? అదానీ సంస్థలు ఏనాడూ డ్రోన్లను తయారు చేయలేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. దేశంలోని ఇతర కంపెనీలు కూడా అభివృద్ధి చేశాయి. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు... అదానీకి ఆ కాంట్రాక్టు దక్కేలా చేశారు'' అని రాహుల్ అన్నారు.

Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు?: పార్లమెంటులో రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi: ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంస్థల వ్యవహారంపై రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. ”ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు? అదానీ సంస్థలు ఏనాడూ డ్రోన్లను తయారు చేయలేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. దేశంలోని ఇతర కంపెనీలు కూడా అభివృద్ధి చేశాయి. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు… అదానీకి ఆ కాంట్రాక్టు దక్కేలా చేశారు” అని అన్నారు.

”గతంలో మోదీజీ బంగ్లాదేశ్ వెళ్లారు. ఆ దేశానికి విద్యుత్తు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్ పవర్ డెవెలప్ మెంట్ బోర్డు 50 ఏళ్ల పనుల కాంట్రాక్టును అదానీకి ఇచ్చింది. అనుభవం లేని వారికి విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఇవ్వకూడదని ఇంతకు మందు నిబంధన ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కూడా మార్చేసింది.

ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించింది. 2014లో గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 609వ స్థానంలో ఉండేవారు. 2022లో రెండో స్థానికి ఎగబాకారు. ఆయన విషయంలో జరిగిన అద్భుతం ఏంటోనని నేను ఆశ్చర్యపోయాను. తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు.. ఎక్కడికెళ్లినా అదానీ పేరు వినపడుతోంది.

దేశం మొత్తం అదానీ పేరు వినిపిస్తోంది. ఏ వ్యాపారంలోనూ అదానీకి ఓటమి ఎదురు కాలేదు. అనేక రంగాల్లో అదానీ అంతటి విజయాన్ని ఎలా సాధించారని భారత్ జోడో యాత్రలో నన్ను ప్రజలు అడిగారు. అదానీకి-మోదీకి మధ్య ఉన్న బంధం ఏంటని ప్రశ్నించారు” అని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని మోదీ పర్యటించిన అన్ని దేశాల్లోనూ అదానీకి కాంట్రాక్టులు దక్కాయని రాహుల్ ఆరోపించారు.

నాలుగో రోజూ పార్లమెంట్లో గందరగోళం

అదానీ వ్యవహారంపై వరుసగా నాలుగో రోజు పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం ప్రారంభమయ్యాక కూడా అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదికపై రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ చర్చకు పట్టుబట్టింది.

సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అనంతరం లోక్ సభ మధ్యాహ్నం 1.30 గంటల వరకు వాయిదా పడింది. అలాగే, రాజ్యసభ మద్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అనంతరమూ అదే పరిస్థితి నెలకొనడంతో రేపటికి ఉభయసభలు వాయిదాపడ్డాయి. కాగా, టర్కీకి భారత్ సాయంపై లోక్ సభలో ఇవాళ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చేశారు. టర్కీ, సిరియాలో భూకంప మృతులకు లోక్ సభ సంతాపం తెలిపింది.

Vinaro Bhagyamu Vishnu Katha Trailer : ఫోన్ నెంబర్ నైబర్ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ‘వినరో భాగ్యం విష్ణు కథ’.. ట్రైలర్ అదుర్స్!