Farmer Protest: రైతుల్ని చంపిన ఆ మంత్రి రాజీనామా చెయ్యాలి – రాహుల్ గాంధీ

లఖింపూర్ ఖేరీ ఆందోళనలో రైతుల చావుకు కారణమైన మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అయిన అజయ్ కుమార్ మిశ్రాకు లఖింపూర్ ఖేరీ హింసకు

Farmer Protest: రైతుల్ని చంపిన ఆ మంత్రి రాజీనామా చెయ్యాలి – రాహుల్ గాంధీ

Rahul Gandhi

Farmer Protest: లఖింపూర్ ఖేరీ ఆందోళనలో రైతుల చావుకు కారణమైన మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అయిన అజయ్ కుమార్ మిశ్రాకు లఖింపూర్ ఖేరీ హింసకు సంబంధముందని అన్నారు.

‘లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటన గురించి మాట్లాడేందుకు మమ్మల్ని అనుమతించాలి. ఆ మంత్రి రాజీనామా చేయాలి. అతనికి తప్పక శిక్ష పడాలి’ అని లోక్ సభ వేదికగా అన్నారు రాహుల్. దీని కారణంగా లోక్ సభ మధ్యాహ్నం 2గంటల వరకూ స్తంభించిపోయింది. రాజ్యసభ, ఎగువ సభలోనూ ఇవే కారణాలతో మధ్యాహ్నం 2గంటల వరకూ ఆగిపోయాయి.

మినిష్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ సంబంధిత మంత్రితో అధికారిక చర్చల్లో ఉన్నారని కొందరు చెప్పారు. దీనిపై జరిపిన సిట్ దర్యాప్తులో ముందుగానే ప్లాన్ చేసి ఇలా చేశారని అన్నారు.

………………………………………….. పుష్ప టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్

లఖింపూర్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ (సీజేఎమ్) చింతా రామ్ ఇప్పటికే సిట్ కు ప్రత్యేక అనుమతులిచ్చారు. సెక్షన్స్ 307 హత్యాయత్నం, సెక్షన్ 326 ఉద్దేశ్యపూర్వకంగా ఆయుధాలతో గాయపరచడం లాంటివి ఎఫ్ఐఆర్ లో పేర్కొనవచ్చని తెలిపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆశిష్ మిశ్రా మాత్రమే కనిపిస్తున్నారు.

అక్టోబర్ 3న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలో ఈ ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రికి కేశవ్ ప్రసాసద్ మౌర్యా, అజయ్ మిశ్రా సొంతూరైన ప్రాంతానికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. ప్రస్తుతం ఆ రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసింది.