పట్టాలపైకి మరో 39 ప్రత్యేక రైళ్లు…తెలుగు రాష్ట్రాలకు నాలుగు

10TV Telugu News

Railways to start 39 special trains   కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

అయితే, ఆ తర్వాత వలస కూలీల తరలింపు కోసం దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ.. సెప్టెంబర్ నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, ఇప్పుడు మరో 39 రైళ్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది.రైల్వే శాఖ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి – కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది