Jobs for Beggers: యాచకులకు ఉద్యోగాలు.. ప్రభుత్వం కొత్త ఆలోచన

రోడ్లపై దయనీయ జీవితం గడుపుతూ.. యాచిస్తూ జీవించేవారిని చూస్తూనే ఉన్నాం.. భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుని, రోడ్ల పక్కన నిద్రిస్తుండేవారు ఎక్కువైన పరిస్థితి.

Jobs for Beggers: యాచకులకు ఉద్యోగాలు.. ప్రభుత్వం కొత్త ఆలోచన

Jobs for Beggers in rajasthan

Jobs for Beggers: రోడ్లపై దయనీయ జీవితం గడుపుతూ.. యాచిస్తూ జీవించేవారిని చూస్తూనే ఉన్నాం.. భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుని, రోడ్ల పక్కన నిద్రిస్తుండేవారు ఎక్కువైన పరిస్థితి. అందుకు కారణం ఉద్యోగాలు, చేయడానికి పనిలేకపోవడం కూడా.. అటువంటివారి జీవితాలు మెరుగుపరచాలని, వారి కాళ్లపై వారు నిలబడేలా ఏర్పాట్లు చెయ్యాలని భావిస్తోంది రాజస్థాన్‌ ప్రభుత్వం. పనిచేయగల సామార్థ్యం ఉండి యాచిస్తూ బతుకుతోన్నవారిని గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పిస్తుంది ప్రభుత్వం.

ఈమేరకు పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా 60 మంది యాచకులకు ఉద్యోగాలు కల్పించింది. ‘వొకేషనల్‌ ట్రైనింగ్ ఫర్‌ లైఫ్‌ విత్‌ డిగ్నిటీ’ పేరుతో రాజస్థాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్‌లీహుడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ పథకంలో భాగంగా అధికారులు యాచకులకు ఏడాదిపాటు వివిధ వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రభుత్వం అందుకు సంబంధించిన బాధ్యతలు తీసుకుంటుంది.

ఈ పథకం గురించి ఆర్‌ఎస్‌ఎల్‌డీసీ డైరెక్టర్‌ నీరజ్‌ కె. పవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాచకులు అనేవారు ఉండకూడదు అనేది ప్రభుత్వం యోచన.డ యాచకులందరికీ మంచి జీవితాన్ని అందించాలని సీఎం సంకల్పించారు. ‘‘తొలుత రాష్ట్రంలో 100 మంది యాచకులకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం 60 మంది శిక్షణ పూర్తయి ఉద్యోగాలు పొందారు. మిగిలినవారు శిక్షణ తీసుకొని, ఉద్యోగంలో చేరేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నాం” అని అధికారులు చెబుతున్నారు.