నోరు విప్పిన RBI : నోట్ల రద్దు వద్దంటే.. ప్రజా శ్రేయస్సు అన్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 01:42 PM IST
నోరు విప్పిన RBI : నోట్ల రద్దు వద్దంటే.. ప్రజా శ్రేయస్సు అన్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తానని హామీ ఇచ్చారు. నిజానికి మోడీ చెప్పినట్టు ఒక్క అద్భుతమూ జరగలేదు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితం లేదు. నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. నోట్ల రద్దు బిగ్ ఫెయిల్యూర్ గా నిలిచింది. 2016, నవంబర్ 8న పెద్ద నోట్లు(రూ.500, రూ.1000) రద్దు చేస్తున్నట్టు మోడీ ప్రకటించారు.
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి

నోట్ల రద్దు గురించి తాజాగా ఆర్బీఐ నోరు విప్పింది. కీలక విషయాలు బయటపెట్టింది. నోట్ల రద్దుని తాము తీవ్రంగా వ్యతిరేకించామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ప్రజా శ్రేయస్సు కోసం తప్పదు అని ప్రధాని మోడీ తేల్చి చెప్పడంతో  తాము కాదనలేకపోయామని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకోవడానికి రెండున్నర గంటల ముందు తాము ప్రధాని మోడీతో మాట్లాడామని అన్నారు. నోట్ల రద్దుని వ్యతిరేకిస్తూ 4 అభ్యంతరాలు లేవనెత్తామని చెప్పారు.

నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. బ్లాక్ మనీని వెనక్కి తెప్పించలేము అని, ఇంత స్వల్ప సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే జీడీపీపై ప్రభావం చూపుతుందని ప్రధానికి వివరించినట్టు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ప్రధాని మాత్రం అవేవీ పట్టించుకోలేదని, దేశం కోసం ప్రజా శ్రేయస్సు కోసం తప్పదు అని తేల్చి చెప్పడంతో నోట్ల రద్దు నిర్ణయానికి తాము అంగీకరించాల్సి వచ్చిందన్నారు. బ్లాక్ మనీ.. డబ్బు రూపంలో మాత్రమే కాదు ఆస్తులు, గోల్డ్, రియల్ ఎస్టేట్ రూపంలో దాచుకున్నారని.. అందువల్ల నోట్లరద్దుతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రధానికి తెలియజేశామన్నారు. నోట్ల రద్దు గురించి ఆర్బీఐ తాజాగా వెల్లడించిన విషయాలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. డీమానిటైజేషన్ ను మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ సహా విపక్షాలకు.. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు మరో అవకాశం దొరికినట్టు అయ్యింది.
Read Also : చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే: జగన్