జనవరి 26 నుంచి పాఠశాలల్లో రాజ్యాంగ ఉపోద్ఘాతం చదవడం తప్పనిసరి : మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ 

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 12:27 AM IST
జనవరి 26 నుంచి పాఠశాలల్లో రాజ్యాంగ ఉపోద్ఘాతం చదవడం తప్పనిసరి : మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ 

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపోద్ఘాతం చదవడం “రాజ్యాంగ సార్వభౌమాధికారం, అందరి సంక్షేమం” ప్రచారంలో భాగం అని రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్ తెలిపింది.

జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం నుంచి అన్ని పాఠశాలల్లో తరగతులు ప్రారంభించే ముందు విద్యార్థులందరూ ప్రార్థన అనంతరం భారత రాజ్యాంగంలోని ఉపోద్ఘాత ప్రకటన అయిన ప్రవేశికను చదవాలని మంగళవారం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షాగైక్వాడ్ ఆదేశించారు. మన రాజ్యాంగంలోని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావాన్ని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఈ ప్రవేశిక చదివేలా ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని తప్పనిసరిగా చదవవలసి ఉంటుందని రాష్ట్ర మంత్రి చెప్పారు.

“విద్యార్థులు రాజ్యాంగంలోని ఉపోద్ఘాతాన్ని పఠిస్తారు, తద్వారా దాని ప్రాముఖ్యత వారికి తెలుస్తుంది. ఇది ప్రభుత్వ పాత తీర్మానం. అయితే దీన్ని జనవరి 26 నుంచి అమలు చేస్తాం ” అని పాఠశాల విద్యాశాఖ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఉదయం ప్రార్థనల తర్వాత ప్రతిరోజూ విద్యార్థులు ఉపోద్ఘాతం చదువుతారని మంత్రి తెలిపారు.

పాఠశాల సమావేశాల సందర్భంగా ఉపోద్ఘాతం చదవడంపై ప్రభుత్వ తీర్మానం (జిఆర్) ఫిబ్రవరి 2013 లో కాంగ్రెస్-ఎన్‌సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జారీ చేశారు. జనవరి 21, 2020 నాటి సర్క్యులర్ ప్రకారం, గత ప్రభుత్వ తీర్మానం అమలు చేయలేదు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులను రాజ్యాంగం ఉపోద్ఘాతం చదివేలా చేస్తుంది.

ఎన్‌సిపితో పాటు శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అగాడి ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఉంది. మహారాష్ట్రలో “రాజ్యాంగ విరుద్ధమైన” CAA అనుమతించబడదని చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్పారు.