భర్తంటే ఇలా ఉండాలి : భార్యకు చాపర్ రైడింగ్ గిఫ్ట్ ఇచ్చిన టీచర్  

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 05:15 AM IST
భర్తంటే ఇలా ఉండాలి : భార్యకు చాపర్ రైడింగ్ గిఫ్ట్ ఇచ్చిన టీచర్  

భార్య ఏదైనా చిన్నపాటి కోరిక కోరితే..చాలామంది భర్తలు అదో పెద్ద భారంగా భావిస్తారు. రాచి రంపాన పెడుతుందని యాగీ చేస్తారు. కానీ భార్యాభర్తల మధ్య అవగాహన..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే భార్య కోరిక భర్తకు..భర్త బాధ్యతలు భార్యకు ఏమాత్రం బరువనిపించదు. బాధ్యత అనిపిస్తుంది. అలా ఉన్నవారి సంసారం నల్లేరుమీద నడకలా సాగిపోతుంది. వారు దాంపత్యాన్ని సంతోషంగా ఆస్వాదిస్తారు.అటువంటి ఓ భర్త తాను రిటైర్ అయిన రోజునే భార్య కోరికను తీర్చి ఆమె కళ్లలో ఆనందాన్ని చూసి అంతకంటేతనకు ఇంకేకావాలి అంటూ మురిసిపోయాడు.

రమేష్ చంద్ మీనా..టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రాజస్థాన్ లోని అల్వర్ జిల్లా  మలావలీ గ్రామం తన కుటుంబంతో నివసిస్తున్నారు రమేష్ చంద్ర మీనా. ఆ గ్రామంలోనే రమేష్ చంద్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా తన జీవితంలో కష్టంలోను..సుఖంలోను తోడూ నీడగా ఉన్న భార్య కోరికను తీర్చాలనుకున్నాడు.దాని కోసం ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.మూడున్నర లక్షలకు పైగా ఖర్చుచేశాడు. 

ఓ రోజు రమేష్ చంద్ భార్యతో కలిసి ఇంటి డాబామీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ హెలికాప్టర్ ఎగురుకుంటూ వెళ్లింది. దాన్ని చూసి రమేష్ చంద్ భార్య మనం ఎప్పటికన్నా హెలాకాప్టర్ ఎక్కగలమా అంటూ ఆశగా భర్తను అడిగింది. అది రమేష్ చంద్ మనస్సులో ఉండిపోయింది. తాను రిటైర్ అయిన సందర్భంగా భార్యను హెలాకాప్టర్ ఎక్కించాలనుకున్నాడు. దానికోసం కలెక్టర్ ఆఫీస్ లో వినతిపత్రం ఇచ్చారు.  పర్మిషన్ కోసం రూ.3.70లక్షలు ఖర్చు పెట్టారు. దానికి పర్మిషన్ కూడా వచ్చింది. దీంతో భార్య కోరిను తీర్చుబోతున్నాననే ఆనందంతో  రమేష్ చంద్ ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు.

ఉగ్యోగ బాధ్యతల నుంచి రమేష్ రిటైర్ అయిన రోజునే భార్యను హెలికాప్టర్ ఎక్కించాలనుకున్నారు రమేష్ చంద్. ఈ క్రమంలో తాను రిటైర్ అయిన రోజునే భార్యను స్కూల్లో పదవీ విరమణ కార్యక్రమం పూర్తి కాగానే భార్యను హెలీకాప్టర్‌లో  కూర్చోబెట్టుకుని తన స్వగ్రామానికి తీసుకువచ్చారు రమేష్ చంద్ మీనా. దీని కోసం ఓ మధ్య తరగతి స్కూల్ టీచర్ పెట్టిన ఖర్చు ముఖ్యంకాదు. భార్య కోరికను తీర్చటమే లక్ష్యంగా పెట్టుకున్నారు రమేష్ చంద్ర మీనా.తానేదో యథాలాపంగా అన్న మాటను మనస్సులో పెట్టుకుని తనకోసం భర్త పడిన తపనకు ఆమె తనకంటే అదృష్టవంతురాలు లేదని మురిసిపోతోంది.