Corona positive తో ట్రైన్ ఎక్కితే జరిమానాతో పాటు జైలుశిక్షా తప్పదు : RPF worning

  • Published By: nagamani ,Published On : October 15, 2020 / 01:33 PM IST
Corona positive తో ట్రైన్ ఎక్కితే జరిమానాతో పాటు జైలుశిక్షా తప్పదు : RPF worning

RPF Corona worning : కరోనా పాజిటివ్ ఉన్నవారు ట్రైన్ ఎక్కితే జరిమానా, జైలు శిక్ష రెండూ తప్పవని రైల్వే భద్రత దళం (ఆర్‌పీఎఫ్) హెచ్చరించింది. పండుగలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపనుంది.




పండుగ అంటే చాలా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణీకులు ఈ కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసింది.


కరోనా పరీక్షలు చేయించుకుని..రిజల్ట్స్ రాకముందే స్టేషన్‌కు రావడం, రైలెక్కడం..సామాజిక దూరం పాటించకపోవటం..మాస్కు సరిగా ధరించకపోవడం వంటి వాటిని తీవ్రంగా పరిగణించనున్నట్టు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఎటువంటి పనులు చేసినా అది నేరం కిందే పరిగణిస్తామని తెలిపింది.దీనికి సంబంధించి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని ఆర్‌పీఎఫ్ అధికారులు హెచ్చరించారు.


అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయటం..అపరిశుభ్రంగా వ్యవహరించటం కూడా నేరమేననీ..ఇటువంటి పనులు కరోనా వ్యాప్తికి కారణమవుతాయని కాబట్టి ప్రయాణీకులంతా మార్గదర్శకాలకు తప్పనిసరిగా అనుసరించాలని హెచ్చరించింది.