కారు టైరు లో నోట్ల కట్టలు

  • Published By: chvmurthy ,Published On : April 21, 2019 / 04:33 AM IST
కారు టైరు లో నోట్ల కట్టలు

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ   భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లకు పంచటానికి  రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కారు టైరులో  తరలిస్తున్న 2 కోట్ల 30లక్షల రూపాయలను కర్ణాటకలో ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకలో శనివారం ఒక్కరోజే 4 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 23న 3వ విడతలో పోలింగ్ జరిగే కర్ణాటకలో, బెంగళూరు నుంచి శివమొగ్గకు  కారులో డబ్బు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

కారుకు అదనంగా ఉండే టైరులో(స్టెఫినీ) దాచిపెట్టిన 2వేల రూపాయలనోట్ల కట్టలను తరలించాలని ప్రయత్నించగా తనిఖీల్లో  దోరికిపోయారు.   తమిళనాడులోని కొయంబత్తూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ డబ్బుతరలిస్తున్నట్లు తెలిసింది. ఆ వ్యాపారవేత్త వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏ పార్టీకిచెందిన వారు ఉన్నారు? ఏదైనా రాజకీయ పార్టీకి ఇచ్చేందుకు తరలిస్తున్నారా? అని ఎన్నికల అధికారులు ఆరా తీస్తున్నారు. స్వాధీనంచేసుకున్న నగదు ఐటీ అధికారులకు అప్పగించారు.