శబరిమల: 51 మంది మహిళలు దర్శనం

శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.

  • Published By: chvmurthy ,Published On : January 19, 2019 / 03:16 AM IST
శబరిమల: 51 మంది మహిళలు దర్శనం

శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలుప్రవేశించవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు 51 మంది మహిళకు అయ్యప్పను దర్శించుకున్నారని  కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ సమాచారం కొత్త వివాదాలకు దారి తీసింది. 
2019 జనవరి 2 బుధవారం తెల్లవారు ఝూమున శబరిమల ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలు బిందు అమ్మిని, కనకదుర్గలకు 24 గంటలూ పోలీసు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు  కేరళ పోలీసులను ఆదేశించింది. అయ్యప్పను దర్శించుకునే మహిళలకు కేరళ ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పిస్తూ ఉంటే, ఇక ముందు కూడా కొనసాగించవచ్చని సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.