Sachin Pilot: రాజస్థాన్ సీఎం పదవిపై సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు.. . అశోక్ గెహ్లోత్‌ను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తదుప‌రి రాజ‌స్ధాన్ సీఎంగా సచిన్ పైలట్ పేరు తెరపైకి వస్తుంది. ఇదే విషయంపై సచిన్ పైలట్ బుధవారం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sachin Pilot: రాజస్థాన్ సీఎం పదవిపై సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు.. . అశోక్ గెహ్లోత్‌ను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే..

Sachin Pilot

Sachin Pilot:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్నారు. సోనియాగాంధీ, రాహుల్ తో సాహా కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు అశోక్ గెహ్లోత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు ఇస్తున్న విషయం విధితమే. ఎన్నిక ప్రక్రియ జరిగినప్పటికీ అశోక్ గెహ్లోత్‌ పార్టీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ విషయంపై  గెహ్లోత్‌ మాట్లాడుతూ.. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన నేను నిర్వహిస్తానని, నాకు పదవి ముఖ్యకాదని పేర్కొన్నారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగే విషయంపై ప్రశ్నించగా.. కాలమే అందుకు సమాధానం చెబుతుందంటూ గెహ్లోత్‌ పేర్కొన్నాడు.

Wedding Photo Shoot: వధువు వినూత్న ఆలోచన.. గుంతల రహదారిపై కేరళ వధువు ఫొటోషూట్.. వీడియో వైరల్..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లోత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న క్రమంలో.. బుధవారం సోనియాతో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం కేరళ వెళ్లి భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీనిసైతం గెహ్లోత్‌ కలవనున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోటీ చేస్తార‌నే వార్త‌ల న‌డుమ త‌దుప‌రి రాజ‌స్ధాన్ సీఎం ఎవ‌ర‌నే అంశంపై వాడివేడి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గెహ్లోత్ స్ధానంలో కాంగ్రెస్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ సీఎం ప‌గ్గాలు చేప‌డ‌తార‌నే ఊహాగానాలు సాగుతున్నాయి.

Deers For Cheetahs: చీతాలకు ఆహారంగా జింకలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన బిష్ణోయ్ వర్గం.. ప్రభుత్వ సమాధానమిదే!

బుధవారం 14వ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట సచిన్ పైలట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ పైలట్ ను రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయంపై విలేకరుల ప్రశ్నించగా.. పార్టీ త‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా తాను నిర్వ‌ర్తిస్తాన‌ని చెప్పారు. అశోక్ గెహ్లోత్ సీనియ‌ర్ నేత‌ని, ఆయ‌న ద‌శాబ్ధాలుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నార‌ని, వ‌చ్చే ఏడాది రాజ‌స్ధాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని పైల‌ట్ స్ప‌ష్టం చేశారు. త‌దుప‌రి రాజ‌స్ధాన్ సీఎం ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా కాంగ్రెస్ నాయ‌క‌త్వం త‌మ‌కు ఏ బాధ్య‌త‌ల‌ను నిర్ణ‌యించినా దాన్ని ఆమోదిస్తామ‌ని పైల‌ట్ పేర్కొన్నారు.