Sadhvi Rithambara: నలుగురు పిల్లల్ని కనండి, ఇద్దరినీ దేశానికి ఇవ్వండి: సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలో ప్రతి జంట నలుగురు పిల్లల్ని కని ఇద్దరినీ దేశానికి అంకితం చేయాలని హిందూ జాతీయ వాది సాధ్వి రితంబర అన్నారు

Sadhvi Rithambara: నలుగురు పిల్లల్ని కనండి, ఇద్దరినీ దేశానికి ఇవ్వండి: సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు

Sadhvi

Sadhvi Rithambara: భారత దేశం త్వరలోనే హిందూ రాజ్యాంగ అవతరించబోతుందని..అందుకోసం దేశంలో ప్రతి జంట నలుగురు పిల్లల్ని కని ఇద్దరినీ దేశానికి అంకితం చేయాలని హిందూ జాతీయ వాది సాధ్వి రితంబర అన్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు “మేమిద్దరం..మాకు ఇద్దరు” అనే విధానాన్ని పాటిస్తున్న హిందూ దంపతులు..ఇకపై నలుగురిని కని, పెంచీ ఆ పిల్లల్లో ఇద్దరినీ దేశానికి ఇవ్వాలని సాధ్వి రితంబర పిలుపునిచ్చారు. ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఆర్ఎస్ఎస్ కు, మరొకరిని విశ్వహిందూ పరిషత్ కు అప్పగించాలని సాధ్వి రితంబర సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత దేశం హిందూ రాజ్యాంగ అవతరించనుందని, అందులో దేశ ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Also read:YSRCP: వైసీపీలో సంస్థాగత పదవుల పంపకం.. నేడు తుది జాబితా!

ప్రస్తుతం “దుర్గ వాహిని” అనే హిందూ ధార్మిక సంస్థ వ్యవస్థాపక చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు సాధ్వి రితంబర. విశ్వహిందూ పరిషత్ కె చెందిన మహిళా విభాగమే ఈ దుర్గ వాహిని. అయితే..తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు సాధ్వి సుముఖత వ్యక్తం చేయలేదు. జహింగిర్ పురి హింస ఘటనపై సాధ్వి రితంబర స్పందిస్తూ..దేశంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే ఇటువంటి చర్యలకు పాల్పడుతారని..రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్నవారు మట్టికరవక తప్పదని ఆమె అన్నారు.

Also read:Telangana Corona Latest Bulletin : తెలంగాణలో కొత్తగా 20 కరోనా కేసులు