ఎస్‌బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్, తక్కువ వడ్డీకే హోం లోన్స్

10TV Telugu News

sbi home loan :  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోం లోన్ బిజినెస్ లో రూ. 5 లక్షల కోట్ల మార్క్ ను అధిగమించింది. దీంతో కస్టమర్లకు హోం లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీలాంటి ఆఫర్లను ప్రకటించింది. రోజుకు వెయ్యిమంది గృహ రుణ కస్టమర్లకు సరసమైన వడ్డీరేటుకే లోన్లను అందించనుంది. ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేయడం గమనార్హం. కొత్త గృహ రుణ వినియోగదారుల కోసం బ్యాంక్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. 7208933140 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మొత్తం వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని ఎస్‌బీఐ వెల్ల‌డించింది.

సొంతింటి కల నేర్చుకోవాలని ప్రతొక్కరూ అనుకొంటారని, సరసమైన వడ్డీ రేట్లతో రుణాలు అందించాలనే ప్రయత్నం తాము ఎప్పుడూ చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా..ఎస్ బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. రెగ్యులర్ హోమ్ లోన్లతోపాటు ఆర్మీ అండ్‌ డిఫెన్స్ సిబ్బందికి ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్, స్మార్ట్ హోమ్, ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం టాప్‌ అప్ లోన్, మాక్స్ గెయిన్ హోమ్ లోన్, మహిళల కోసం హెర్‌ఘర్‌ హోం లోన్, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, ఫ్లెక్సీపే హోమ్ లోన్ లాంటి రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు.