ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. అలాంటి మెసేజ్ వస్తే, వెంటనే ఫోన్ చేయండి

ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. అలాంటి మెసేజ్ వస్తే, వెంటనే ఫోన్ చేయండి

sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.

ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు ఖాతా నుంచి నుంచి మనీ కట్ అయినట్టు మెసేజ్ వస్తే.. వెంటనే.. తమకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ సూచించింది. తమ దృష్టికి తెస్తే యూపీఐ సేవను నిలిపివేస్తామంది.

అలాంటి సమయంలో తక్షణమే యూపీఐ సేవలను నిలిపివేయడానికిగాను ఎస్బీఐ నెంబర్లు ఇచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ 1800111109, ఐవీఆర్ నెంబర్లు 1800-425-3800..1800-11-2211కు ఫోన్ చేయడం లేదా 9223008333 నెంబర్ కు ఎంఎంఎస్ చేయాలంది. https://cms.onlinesbi.com/CMS/లోనూ ఫిర్యాదు చేయవచ్చంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్‌ చేయడం ద్వారా వినియోగదారులు తన యూపీఐ సేవలను నిలిపివేయవచ్చంది.

ఈ మేరకు ట్వీట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా 44 కోట్ల మంది తన ఖాతాదారులను ఎస్బీఐ హెచ్చరించింది. ‘ఖాతాదారులు ఎవరైనా వారు చేయని యూపీఐ పేమెంట్‌కు డబ్బు డెబిట్‌ చేయమని ఎస్‌ఎంఎస్‌ వస్తే, అప్రమత్తంగా ఉండాలి. ఈ సూచనలను పాటించి, మీ డబ్బు పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్‌ మోసాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎస్బీఐ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది” అని వివరించింది.