Seat Belts: నవంబర్ 1 నుంచి సీట్ బెల్టు తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన ముంబై పోలీసులు

కారులో సీట్ బెల్టు పెట్టుకోకుంటే ఇకపై డ్రైవర్‌తోపాటు, ప్రయాణికులు కూడా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నవంబర్ 1 నుంచి ముంబై పరిధిలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Seat Belts: నవంబర్ 1 నుంచి సీట్ బెల్టు తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన ముంబై పోలీసులు

Seat Belts: వచ్చే నెల 1 నుంచి ముంబై పరిధిలో కారులో ప్రయాణించే ప్రయాణికులు, డ్రైవర్.. అందరూ తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాల్సిందే. దీనికి సంబంధించి ముంబై పోలీసులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం.. ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాల్సిందే.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

మోటార్ వెహికిల్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2019, సెక్షన్ 194 (బి) ప్రకారం సీటు బెల్టు ధరించకుంటే చట్టప్రకారం నేరమే. వీరికి నిబంధనల ప్రకారం శిక్ష విధిస్తారు. సీట్ బెల్ట్ నిబంధన ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ అది సరిగ్గా అమలు కావడం లేదు. ఈ అంశం ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మరణంతో మరోసారి తెరమీదికి వచ్చింది. ఆయన గత నెలలో ముంబై సమీపంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయలో ఆయన సీట్ బెల్ట్ ధరించలేదు. అందుకే ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీట్ బెల్ట్ నిబంధనను కఠినంగా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.

Munugodu: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం.. 100కు పైగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

దీనిలో భాగంగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ముంబై రోడ్లపై ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే డ్రైవర్లు, వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే జరిమానాతోపాటు, శిక్ష తప్పదు. నవంబర్ 1 నుంచి అందరూ ఈ రూల్ ఫాలో కావాల్సిందే.