Second Vaccine Dose : మోడీకి కరోనా రెండో టీకా

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండోసారి కరోనా టీకా తీసుకున్నారు.

Second Vaccine Dose : మోడీకి కరోనా రెండో టీకా

second dose

AIMMS : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండోసారి కరోనా టీకా తీసుకున్నారు. మొదటి డోస్ తీసుకున్నా..రెండో టీకా కంపల్సరీ తీసుకోవాలని కేంద్రం, నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం ఉదయం ఆయన చేరుకున్నారు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉన్న నర్సులు ఆయన రెండో కరోనా టీకా వేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో విడుత ప్రారంభమైన మార్చి 01వ తేదీన ప్రధాని మోడీ ఫస్ట్ డోస్ తీసుకున్నారు.

37 రోజుల తర్వాత రెండో డోస్ వేయించుకున్నారు. మొదటి డోసు ఇచ్చిన సిస్టర్‌ పీ. నివేదిత, నిషా శర్మ ఉన్నారు. నివేదిత పుదుచ్చేరికి చెందిన వారు కాగా, నిషా శర్మ పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారు. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఎయిమ్స్ లో కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నట్లు, కరోనా వైరస్ పై జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటిగా వెల్లడించారు. అర్హులైన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ కోసం CoWin.gov.inలో రిజిష్టర్ చేసుకోవాలన్నారు. దేశంలో ఇప్పటివరకు 9 కోట్లకుపైగా మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Read More : Varanasi : కరోనా కల్లోలం : వ్యాక్సిన్ కొరత..41 హాస్పిటల్స్ కు తాళాలు