Crude oil prices: ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి ఏమని లేఖ రాశాయి..
వాహనదారులకు కాస్త ఊరటనిచ్చిన ఇంధన ధరలు మళ్లీ పెరగుతాయా? ఆ మేరకు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయా.. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Crude oil prices: వాహనదారులకు కాస్త ఊరటనిచ్చిన ఇంధన ధరలు మళ్లీ పెరగుతాయా? ఆ మేరకు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయా.. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని.. లీటర్ పెట్రోల్‌పై రూ. 20-25, డీజిల్‌పై రూ.14-18 మేర నష్టపోతున్నామని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఇంధన మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా తెలిపాయి.
YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు, క్రూడ్ సంబంధిత ఉత్పత్తుల ధరలు దశాబ్దాల గరిష్టానికి ఎగిశాయి. కానీ 90శాతం మార్కెట్ నియంత్రణ కలిగిన ప్రభుత్వ రంగం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను గతకొంత కాలంగా యథాతథంగా ఉంచుతున్నాయి. దీని వల్ల తాము నష్టపోతున్నామని, ఈ నష్టాలను భరించలేమంటూ ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఈ నష్టాల నుంచి మమ్మల్ని కాపాడాలంటూ జియో – బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ ఇంధన కంపెనీలు ఇంధన మంత్రిత్వ శాఖను లేఖ ద్వారా కోరాయి.
2021 నవంబర్ నుంచి.. 2022 మార్చి21 వరకు (దాదాపు 137 రోజులు) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. ఐదు నెలల తర్వాత 2022 మార్చి 22న తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. అదీ ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో పెంచాల్సి వచ్చిందని కేంద్రం వివరణ ఇచ్చింది. వరుసగా 14రోజులు సగటున 80 పైసల చొప్పున ఇంధన ధరలు పెంచుకుంటూ వెళ్లాయి చమురు సంస్థలు. మళ్లీ ఏప్రిల్ 6 నుంచి స్థిరంగా ఉంచాయి.
PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో పోస్టు చేసిన కేంద్ర మంత్రి
ఈ నేపథ్యంలోనే.. రిటెయిలింగ్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్‌ఐపీఐ) పేర్కొంది. అందుకే.. ప్రైవేట్ రిటెయిలర్స్కు మద్దతుగా నిలవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఇటీవల లేఖ కూడా రాసింది. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచకపోతే భారీగా నష్టాలు వస్తున్నాయని.. ఇది డీలర్స్, ట్రాన్స్పోర్టర్స్, ప్రత్యక, పరోక్ష ఉద్యోగులు అందరిపైనా ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేసింది. రీటెయిల్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనకు సరైన వాతావరణం కల్పించాలని కోరింది.
- Petrol, Diesel Price: అడ్డేలేదు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ కు 80పైసలు పెరుగుదల ..
- Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి
- Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ..హైదరాబాద్ లో ఎంతంటే ….
- Diesel Price Hiked : భారీగా పెరిగిన డీజిల్ ధర.. లీటర్‌పై రూ.25 పెంపు.. వారికి మాత్రమే
1Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
2Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
3IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
4World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
5GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
6Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
7Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
8Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
9Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
10Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!