నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌, నిఫ్టీ

నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Sensex and Nifty started with losses : భారతీయ స్టాక్‌మార్కెట్లలో రక్తకన్నీరు కొనసాగుతోంది. వరుసగా ఐదోరోజు మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 5వందలు, నిఫ్టీ 130పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. గత నాలుగు సెషన్లలో మార్కెట్లు నష్టాలతోనే ముగిసాయి.

లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయమైంది. వరుసగా మూడోరోజు కూడా FIIలు భారీ అమ్మకాలకు పాల్పడటంతో మార్కెట్లు బేర్‌ మంటున్నాయి. ఫెడ్‌ తాజా ప్రకటనతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఏషియన్ మార్కెట్లు కూడా ఢీలా పడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

బడ్జెట్‌కు ముందు మార్కెట్లు వరసుగా పతనమవుతున్నాయి. ఇటీవలే 50వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం 47వేలకు ఎగువన ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లపై అమెరికా మార్కెట్ల నష్టాలు ప్రభావం చూపాయి.