Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

Sharath Chandra Reddy Delhi liquor scam

Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. దీంతో మరిన్ని కీలక విషయాలు బయటకు రానున్నట్లుగా తెలుస్తోంది. తాను అప్రూవర్ గా మారినట్లుగా శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టులో మెమో దాఖలు చేశారు. అప్రూవర్ గా మారటానికి తనకు అకాశం కల్పించాలని కోరుతు అభ్యర్థించారు. దానికి ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. దీంతో ఆయన అప్రూవర్ గా మారినట్లు కోర్టుకు మెమో సమర్పించారు.

 

Rahul Gandhi: ఐఫోన్ పట్టుకుని హలో మిస్టర్ మోదీ.. అంటూ రాహుల్ గాంధీ జోక్స్.. ఎందుకంటే?

దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఈక్రమంలో అప్రూవర్ గా మారటంతో ఈకేసు మరో మలుపు తిరిగింది. దీంతో ఈకేసు విచారణంలో మరింత కీలక పరిణామాలకు ఈ మార్పుకాందా? అనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నేతల పేర్లు వినిపించాయి. వారిని నోటీసులు జారీ చేయటమే కాకుండా ఈడీ విచారించటం కూడా జరిగింది. ఈ కేసులో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు.

 

ఈకేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం ఆసక్తికరంగా మారింది. ఈకేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఛార్జ్ షీట్ లో ఉంది. కవిత మాజీ ఆడిటక్ బుచ్చిబాబు కూడా ఈకేసులో నిందితులుగా ఉన్నారు.

Tamilnadu: విద్యార్థులు యూనిఫాంలో ఉంటే బస్ పాస్ అడగొద్దంటూ ఆదేశించిన స్టాలిన్ ప్రభుత్వం

ఢిల్లీ మద్యం వ్యాపారంలో శరత్ చంద్రారెడ్డి 30 శాతం షాపులను దక్కించుకున్నారని ఈడీ చార్జ్ షీటులో ఆరోపించింది. బినామీ కంపెనీతో కలిసి ఆయన మద్యం వ్యాపారం నిర్వహించినట్లుగా ఈడీ అభియోగాలు. సౌత్ గ్రూపుతో ఏర్పాటైన మద్యం సిండికేట్లలో శరత్ చంద్రారెడ్డి అతి పెద్ద పార్టనర్ గా ఉన్నారని ఈడీ ఆరోపిచింది. ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేయడం కోసం డిజిటల్ సర్వర్లలో ఉన్న సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు శరత్ చంద్రారెడ్డి యత్నించారని ఈడీ ఆరోపిచింది. ఇలా అన్ని విధాలుగాను ఇరుక్కుపోయిన ఆయన అప్రూవర్ గా మారడంతో లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఈకేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి తన భార్య ఆరోగ్యం బాగాలేదని ఆమె బాగోగులు చూసుకోవాలని బెయిల్ ఇప్పించాలని కోర్టుకు అభ్యర్థించారు. అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 8న బెయిల్ మంజూరు చేసింది.