Shatabdi Duronto Train Services : త్వరలో శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు

దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Shatabdi Duronto Train Services : త్వరలో శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Shatabdi Duronto Will Run On These Routes Again Railways Also Released The List Of Many Special Trains

Shatabdi, Duronto Train Services : దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైలు సర్వీసులను పునః ప్రారంభించిన రైల్వేశాఖ త్వరలో శతాబ్ది, దురంతో రైలు సర్వీసులను కూడా ప్రారంభిస్తోంది. ఈనెల 21 నుంచి పలు మార్గాల్లో నడిచే ట్రైన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు ఒక జాబితాను మంత్రి విడుదల చేశారు. వీటిలో శతాబ్ది, దురంతో సహా 29 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి.

వీటితో పాటు ఈ నెల 25 నుంచి సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను గోరఖ్‌పూర్‌ నుంచి బాంద్రా టెర్మినస్‌ వరకు నడుపుతామని కేంద్ర  రైల్వేమంత్రి తెలిపారు. ఇందులో న్యూఢిల్లీ – కల్కా శతాబ్ది, న్యూఢిల్లీ – డెహ్రాడూన్‌ శతాబ్ది, న్యూ ఢిల్లీ – అమృత్‌సర్‌ జంక్షన్‌ శతాబ్ది, ఢిల్లీ సారాయ్‌ రోహిల్లా – జమ్మతవి దురంతో ఎక్స్‌ప్రెస్‌, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా – న్యూఢిల్లీ శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్‌,  లక్నో – ప్రయాగ్‌రాజ్‌ సంగం ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు ఈ నెల 21 నుంచి నడుస్తాయని రైల్వేశాఖ  తెలిపింది.

Train

Train