Chandigarh University: చండీఘడ్ యూనివర్సిటీ వీడియో లీక్ వివాదం… మరో నిందితుడి అరెస్టు

పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశానికి సంబంధించి పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అరెస్టు.

Chandigarh University: చండీఘడ్ యూనివర్సిటీ వీడియో లీక్ వివాదం… మరో నిందితుడి అరెస్టు

Chandigarh University: సంచలనం రేపుతున్న చండీఘడ్ యూనివర్సిటీ లీక్డ్ వీడియో కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. సిమ్లాలోని రోహ్రు ప్రాంతానికి చెందిన సన్నీ మెహతా అనే 23 ఏళ్ల యువకుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

Beer Bottles Video: బుల్డోజర్‌తో లక్ష బీర్ బాటిళ్లు ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ.. ఎందుకో తెలుసా!

ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందే బాధ్యురాలైన యువతిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మాయి కూడా సిమ్లాలోని రోహ్రు పట్టణానికి చెందిందే. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక అమ్మాయి, తన తోటి విద్యార్థినిల ప్రైవేటు వీడియోల్ని స్నేహితుడికి పంపినట్లు వివాదం మొదలైంది. చాలా మందికి చెందిన 60 వరకు వీడియోల్ని ఆ అమ్మాయి, తన స్నేహితుడికి పంపిందనే ప్రచారం జరిగింది. దీంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి బాధ్యురాలైన విద్యార్థినితోపాటు, అతడి స్నేహితుడిని కూడా అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. దీనిపై యూనివర్సిటీ అధికారులతోపాటు, పోలీసులు కూడా స్పందించారు.

Indian Air Force: యుద్ధ విమానాలతో ఒళ్లు జలధరించేలా భారత వాయుసేన విన్యాసాలు.. ఆకట్టుకుంటున్న వీడియో

కాగా, ఈ అంశంపై యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. ప్రచారం జరుగుతున్నట్లుగా 60 ఎమ్మెమ్మెస్ వీడియోలు లీక్ కాలేదని, వీడియోను పంపిన విద్యార్థిని తన సొంత వీడియోను మాత్రమే అతడికి పంపిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితుల్ని విచారించిన తర్వాత, వాళ్ల ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని పంజాబ్ పోలీసులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని, పుకార్లను నమ్మొద్దని పోలీసులు, అధికారులు కోరుతున్నారు.