Snow Storm: మూడో రోజూ మూతపడ్డ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి

ఉత్తరాది రాష్ట్రలో తీవ్ర మంచు కురుస్తుంది. గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో తీవ్ర మంచు తుఫాను కురుస్తుంది

Snow Storm: మూడో రోజూ మూతపడ్డ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి

Snow

Snow Storm: ఉత్తరాది రాష్ట్రలో తీవ్ర మంచు కురుస్తుంది. గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో తీవ్ర మంచు తుఫాను కురుస్తుంది. హిమపాతానికి తోడు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చలితీవ్రత ఎక్కువై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమపాతంపై ఉత్తరాది రాష్ట్రాలకు జాతీయ వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, నిత్యావసరాలు ముందుగానే సమకూర్చి పెట్టుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులు సూచనలు జారీచేశారు. చలి నుంచి రక్షణగా ప్రజలు రూమ్ హీటర్లు వినియోగించాలని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఇళ్లలో నిరంతర ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. షిమ్లా, కులుమనాలీ, శ్రీనగర్, అనంతనాగ్, గుల్మార్గ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో ఆరు అంగుళాల మేర హిమపాతం నమోదు అయింది.

Also read: Terror Threat: ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం

కాగా, గత మూడు రోజులుగా కురుసుతన్న హిమపాతం కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. హైవేతో పాటు వివిధ ప్రదేశాలలో కొండ చరియలు విరిగిపడుతుండటంతో ముందస్తు జగ్రత్త చర్యల్లో భాగంగా వాహన రాకపోకలు నిలిపివేశారు. వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో జమ్మూ-శ్రీనగర్ రహదారి పై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు, డ్రైవర్లు సమీప గ్రామాల్లో తలదాచుకోవాలంటు అధికారులు సూచనలు చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు హిమపాతం కొనసాగే అవకాశం ఉందన్న ముందస్తు హెచ్చరికల మేరకు..మంచు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Also read: Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం