Kili Paul Honored: భారతీయ పాటలతో ఫేమస్ అయిన “కిలి పాల్”ను సత్కరించిన ఇండియన్ హై కమిషన్
ఇండియన్ సినిమా పాటలతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన కిలీపాల్ ను టాంజానియాలోని భారత హై కమిషన్ సత్కరించింది.

Kili Paul Honored: ఇండియన్ సినిమా పాటలతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన కిలీపాల్ ను టాంజానియాలోని భారత హై కమిషన్ సత్కరించింది. టాంజానియాలోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన కిలీపాల్.. అక్కడి భారతీయ దౌత్యాధికారి బినయ్ ప్రధాన్ ను కలుసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో భారతీయ సినీమాను ప్రపంచ వ్యాప్తం చేసిన కిలీపాల్ ను బినయ్ ప్రధాన్ అభినందించారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండేవారికి కిలీపాల్ సుపరిచితం. టాంజానియాకు చెందిన కిలీపాల్, తన సోదరి నీమా పాల్ తో కలిసి.. ఇండియన్ సినిమా పాటలకు “లిప్ సింక్(పెదవులు కదిలించుట)” చేస్తూ వీడియోలు రూపొందిస్తుంటాడు.
Also read: Viral Video : భారీ కొండచిలువపై చిరుత దాడి.. వీడియో వైరల్..!
ఈక్రమంలో గతేడాది విడుదలైన షేర్షా సినిమాలోని “రాతన్ లంబియన్” పాటకు లిప్ సింక్ చేస్తూ కిలీపాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రంలోని నటీనటులు సిద్ధార్త్ మల్హోత్రా, కియారా అడ్వాణీ సహా.. హిందీ నటులు ఆయుష్మాన్ ఖురానా, గుల్ పనాగ్, రిచా చద్దా వంటి వారు కిలీపాల్ ను ఇంస్టాగ్రామ్ లో అనుసరించారు. కిలీపాల్ చేస్తున్న వీడియోలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఫిదా అయిపోయారు. ఇంస్టాగ్రామ్ లో అతన్ని అనుసరించే వారి సంఖ్య కేవలం ఏడూ నెలల్లోనే 2 మిలియన్ (20 లక్షలు) దాటేసింది.
View this post on Instagram
టాంజానియా గిరిజన తెగ సాంప్రదాయ వేషధారణలో, చూడగానే ఆకట్టుకునే రూపంతో.. కిలీపాల్ చేసే వీడియోలు ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. ఇక తన కళతో భారతీయ సినిమా పాటలకు ప్రపంచ గుర్తింపు తేవడంతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కిలీపాల్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందని భారత రాయభారి బినయ్ ప్రధాన్ అన్నారు. కిలీపాల్ ను కలుసుకున్న అనంతరం కొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా ఆయన పంచుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram