DMK నేత స్టాలిన్ కు సోనియా ఆహ్వానం

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 09:17 AM IST
DMK నేత  స్టాలిన్ కు సోనియా ఆహ్వానం

లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సోనియాగాంధీ నుంచి ఆహ్వానం వచ్చింది. మే 23న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్షాల భేటీకి హాజరుకావాలని స్టాలిన్‌కు సోనియా ఆహ్వానించారు. 

బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలన్నీ ఏకం అవుతున్న క్రమంలో సోనియా గాంధీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీయేను నిలువరించేందుకు..విపక్షాలను కూడా గట్టేందుకు ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 23న సోనియా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి యూపీయే భాగస్వామ్య పక్షాలతోపాటు తటస్థ పార్టీల అధినేతలకు  కూడా సోనియా ఆహ్వానించారు. కాగా ఈ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో నిర్వహించనున్న ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

ఇప్పటికే పలు పార్టీల అధినేతలను ఈ  సమావేశానికి సోనియా  ఆహ్వానించారు. ఫలితాలు వచ్చిన వెంటనే తటస్థ పార్టీలను యూపీఏలోకి తెచ్చే ప్లాన్‌ చేస్తున్నారు. వివిధ పార్టీలతో కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు.