ట్రోలింగ్స్ పై లోక్ సభ స్పీకర్ కుమార్తె ఫైర్, నిజాలు తెలుసుకొండి

ట్రోలింగ్స్ పై లోక్ సభ స్పీకర్ కుమార్తె ఫైర్, నిజాలు తెలుసుకొండి

Speaker Om Birla’s Daughter : సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె -ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన అంజలి బిర్లా ఫైర్‌ అయ్యారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ట్రోల్‌ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనను ట్రోల్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమని ప్రకటించారు. అంజలి బిర్లా ఇటీవల ఐఏఎస్‌గా ఎంపికైయ్యారు. అయితే తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అత్యున్నత ఉద్యోగాన్ని పొందారంటూ కొంతమంది ఆమెపై సోషల్‌ మీడియాలో విషం చిమ్మారు. ప్రతిభ లేకపోయినా.. పరీక్ష రాయకుండానే జాబ్‌ సంపాదించారంటూ సోషల్‌ మీడియలో విద్వేషపూరిత కామెంట్లు చేశారు.

దీనిపై అంజలీ బిర్లా స్పందించారు…. అవాస్తవాలు ప్రచారం చేసే వారి జాడ కనిపెట్టి వారిని జవాబుదారులుగా నిలబెట్టాలన్నారు. ఈరోజు నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు బలవుతారు. ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ట్రోల్స్‌ వల్ల తనకు కాస్త మంచే జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి వాళ్లను దీటుగా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని తెలిపారు.

వాస్తవానికి అంజలీ బిర్లా పరీక్షలు రాసి ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు అంజలి గురించి అసత్యాలు ప్రచారం చేయడంతో వివాదం పెద్దదైంది.