కుంభమేళా స్పెషల్ : ఎకో ఫ్రెండ్లీ బాబాలు

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 08:59 AM IST
కుంభమేళా స్పెషల్ : ఎకో ఫ్రెండ్లీ బాబాలు

ప్రధాన ఆకర్షణగా నాగ సాధువులు 
ఇకో ఫ్రెండ్లీ బాబాలంటు కామెంట్స్ 

ఉత్తరప్రదేశ్‌ : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అర్థం కుంభమేళా అంగరంగ వైభోగంగా కొనసాగుతోంది.  ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ..ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న నాగ సాధువులు, బాబాలు సైతం ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తున్నారు.

ఒంటిపై వస్త్రాలు లేకుండా, వంటి నిండా విబూది పూసుకుని..పొడవాటి కేశాలు..పెద్ద పెద్ద గడ్డాలు..మెడలో రుద్రాక్షలతో  వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న బాబాలు.. కుంభమేళాకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న యాత్రికులకు ఈ బాబాలు భలే నచ్చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం జరిగే ఈ కుంభమేళాలో తొలిసారిగా ‘కిన్నెర అఖారా’ (హిజ్రాలు) పాల్గొంటున్నారు. వీరంతా రంగుల రంగుల వస్త్రాలతో విచ్చేసి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మేళాలో ఆకట్టుకుంటున్న కొంతమంది బాబాల ఫోటోలు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాయి. వీరిని ఇకో ఫ్రెండ్లీ బాబాలు అంటు ముద్దు ముద్దు కామెంట్స్ పెడ్తున్నారు.