Sensex Crashes : నష్టాల్లో స్టాక్ మార్కెట్

అమెరికా ద్రవ్యోల్బణం ప్రభావంతో భారత మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్బణం చేరడం ప్రభావం చూపించింది. వడ్డీ రేట్లు...

Sensex Crashes : నష్టాల్లో స్టాక్ మార్కెట్

Stock Market (1)

Stock Market : భారత స్టాక్ మార్కెట్ మళ్లీ కుప్పకూలింది. 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. క్రమక్రమంగా పతనం దిశగా కొనసాగుతోంది. సెన్సెక్స్ 950పైగా తగ్గగా.. 250 పాయింట్లకు పైగా నిఫ్టీ కోల్పోయింది. అమెరికా ద్రవ్యోల్బణం ప్రభావంతో భారత మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్బణం చేరడం ప్రభావం చూపించింది. వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనే సంకేతాలు కూడా మార్కెట్‌ను దెబ్బతీసాయి.

Read More : Pooja Hegde : 13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు పూజా హెగ్డే.. మాల్దీవ్స్ లో రచ్చ..

అమెరికా మార్కెట్లు నిన్న భారీ నష్టాలు మూటగట్టుకోగా.. మన మార్కెట్‌లలో FIIల అమ్మకాలు కొనసాగుతుండటం కూడా.. మార్కెట్ పతనానికి కారణమని అనలిస్టులంటున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. ద్రవ్యోల్బణం 7.5 శాతం వద్ద 40 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. దీంతో వడ్డీ పెంపు మరింత పెరుగుతుందనే సంకేతాలు వచ్చాయి. ముదుపర్ల సెంటిమెంట్ దెబ్బతీసింది. దీంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read More : Ram Gopal Varma: సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ -రామ్ గోపాల్ వర్మ

సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్ టెల్, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంకులతో పాటు కొన్ని మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్ డీఎఫ్ సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.