ASER REPORT : కోవిడ్‌ దెబ్బ..చదువుల్లో దారుణంగా వెనుకబడిన స్కూల్ విద్యార్ధులు, రేపటి పౌరుల భవిష్యతుపై ఆందోళన కలిగిస్తున్న ASER రిపోర్ట్

దేశంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు పడిపోవడానికి.. ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులే. కరోనా వైరస్.. మానవాళి మీదే కాదు.. పిల్లల చదువులపైనా తీవ్ర ప్రభావం చూపింది. వరుస లాక్‌డౌన్‌లు, కరోనా ఆంక్షలతో.. పిల్లల చదువులు చట్టుబండలయ్యాయ్. కనీసం.. చూసి చదవడం కూడా మర్చిపోయారంటే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ASER REPORT : కోవిడ్‌ దెబ్బ..చదువుల్లో దారుణంగా వెనుకబడిన స్కూల్ విద్యార్ధులు, రేపటి పౌరుల భవిష్యతుపై ఆందోళన కలిగిస్తున్న ASER రిపోర్ట్

2022 ASER report

ASER REPORT : దేశంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు పడిపోవడానికి.. ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులే. కరోనా వైరస్.. మానవాళి మీదే కాదు.. పిల్లల చదువులపైనా తీవ్ర ప్రభావం చూపింది. వరుస లాక్‌డౌన్‌లు, కరోనా ఆంక్షలతో.. పిల్లల చదువులు చట్టుబండలయ్యాయ్. కనీసం.. చూసి చదవడం కూడా మర్చిపోయారంటే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కోవిడ్‌ దెబ్బకు పిల్లల చదువులు అటకెక్కాయి. లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు మూతబడటం, అప్పటివరకు పరిచయం లేని ఆన్‌లైన్‌ పాఠాలు వినాల్సి రావడంతో.. పిల్లలు చదువులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చాలా మంది పిల్లలు కనీసం తమ పుస్తకాల్లోని పాఠాలు కూడా చదవలేకపోతున్నారని వార్షిక విద్యా నివేదిక సర్వే తేల్చింది. ముఖ్యంగా కోవిడ్‌ వల్ల చిన్న పిల్లల ప్రాథమిక విద్యా సామర్థ్యం అత్యల్ప స్థాయికి పడిపోయింది. 2014 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన పిల్లల పఠన సామర్థ్యం.. లాక్‌డౌన్‌లో పాఠశాలల మూతతో.. మరో రెండేళ్ల కిందటి స్థాయికి పడిపోయింది. కోవిడ్‌ వల్ల అన్ని తరగతుల విద్యార్థుల చదువు చట్టుబండలయ్యిందని గుర్తించింది జాతీయ వార్షిక విద్యా నివేదిక. మహమ్మారి వల్ల 2020లో చివరి రొటీన్ అసెస్‌మెంట్ ఒక క్రమపద్ధతిలో జరగలేదు. 2020 నుంచి 2022 మధ్య.. పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉండటంతో.. ఈ పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు.

కొందరు ఐదో తరగతి విద్యార్థులు.. కనీసం రెండో తరగతి టెక్ట్స్ బుక్స్ కూడా చదవలేకపోతున్నారు. ఎనిమిదో తరగతి పిల్లల సామర్థ్యం కూడా మరింత అధ్వాన్నంగా తయారైంది. చిన్న తరగతుల విద్యార్థులతో పోలిస్తే.. 8వ తరగతి పిల్లల పఠనా సామర్థ్యం 70 శాతానికి పడిపోయింది. 2018లో 73 శాతం మంది పిల్లలు బాగా చదవగలిగేవారని వివరించింది అసర్ రిపోర్ట్. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ అనే తేడా లేకుండా.. అందరి పిల్లల్లోనూ పఠన సామర్థ్యాలు పతనం అయ్యాయని చెబుతోంది వార్షిక విద్యా నివేదిక. 2018లో పాఠాలను సమగ్రంగా చదవగలిగే పిల్లలు 50 శాతం ఉండగా.. 2022కి వచ్చేసరికి ఈ సంఖ్య 42 శాతానికి పడిపోయింది. పిల్లల పఠనా సామర్థ్యం 10 శాతం కంటే తక్కువ పడిపోయిన రాష్ట్రాలు కూడా చాలానే ఉన్నాయి. అక్షరాస్యత ఎక్కువగా ఉండే కేరళలో 2018లో విద్యార్థుల పఠనా సామర్థ్యం 52 శాతం ఉండగా.. ఇప్పుడు 39 శాతానికి పడిపోయింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 23 శాతం నుంచి 10 శాతానికి.. తెలంగాణ 18 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. పిల్లల అభ్యసన స్థాయి గణనీయంగా పడిపోవడాన్ని పెద్ద నష్టంగా వర్ణిస్తున్నారు.

ASER REPORT : చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు .. లెక్కలంటే బిక్కమొహాలేస్తున్న విద్యార్ధులు

పాండమిక్‌ సీజన్‌ ముగిశాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. అదే విధంగా దేశవ్యాప్తంగా బడికి వెళ్లకుండా ఉంటున్న బాలికల నిష్పత్తిలోనూ తగ్గుదల నమోదైంది. 2018తో పోలిస్తే.. 2022లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల సంఖ్యలో 7 శాతం బాలికలు పాఠశాలల్లో చేరారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు చెప్పింది సర్వే. ఇందుకు కూడా కోవిడే కారణమంటున్నారు. కుటుంబ ఆదాయం తగ్గిపోవటం, ప్రైవేట్ స్కూల్ ఫీజులను భరించలేని తల్లిదండ్రులు.. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించారని చెబుతున్నారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ టైమ్‌లో చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలు మూతబడ్డాయ్. అక్కడ చదివిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారని వివరిస్తున్నారు విద్యావేత్తలు.

స్మార్ట్‌ ఫోన్ల వాడకం కూడా విపరీతంగా పెరిగినట్లు.. అసర్ రిపోర్టులో తేలింది. 2018 నాటికి మూడింట ఒకవంతు ఇళ్లలోనే స్మార్ట్ ఫోన్లు ఉండగా.. 2022 నాటికి నాలుగింట మూడొంతుల ఇళ్లకు స్మార్ట్ ఫోన్లు చేరాయ్. దాదాపు 75 శాతం ఇళ్లల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు గుర్తించింది అసర్. ఇక.. 88 శాతం ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉన్నట్లు తేలింది. విద్యార్థులు తమ మేధస్సును ఉపయోగించడం కన్నా.. ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఈ సర్వేతో తేలింది. ఇక.. ఇప్పుడున్న పరిస్థితుల్లో లెక్కలు చేయడం కంటే చదవటంలోనే ఎక్కువ వృద్ధి సాధించాల్సి ఉందని.. తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సూచించింది విద్యా నివేదిక. కమ్యూనిటీ లెర్నింగ్ ద్వారా టీచర్లు.. పిల్లల అభ్యాసన సామర్థ్యం మెరుగుపరిచేలా కృషి చేయాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు.