హత్రాస్ మృతురాలు ఓ ఆవారా..పొలాల్లో ఇలాంటి ఆవారాలు చనిపోవటం సాధారణమే : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : October 7, 2020 / 03:16 PM IST
హత్రాస్ మృతురాలు ఓ ఆవారా..పొలాల్లో ఇలాంటి ఆవారాలు చనిపోవటం సాధారణమే : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తప్రదేశ్ లోని హత్రాస్ ప్రాంతంలోని భాగ్నాలో గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురై చనిపోయిన యువతిపై బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. యువతిపై అత్యాచారానికి తెగబడిన నిందితులు నలుగురు అమాయకులని అంటూ క్లీన్ చిట్ ఇచ్చేనట్లుగా మాట్లాడారు. నిందితులు చాలా మంచివాళ్లని..అమాయకులంటూ వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యాఖ్యానించారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడితో సదరు చనిపోయిన యువతికి సంబంధం ఉందని..ఆమే అతడిని మొక్కజొన్న చేనుకు పిలిచిందంటూ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా చనిపోయిన ఆ యువతిపై ఏమాత్రం కనీసం మానత్వం కూడా లేకుండా ఆవారా అంటూ దారుణమైన పదజాలాన్ని ఉపయోగించారు.



చనిపోయిన ఆ అమ్మాయి ఓ అవారా అమ్మాయి..అటువంటి ఆవారా అమ్మాయిలు పొలాల్లో చనిపోవటం సర్వసాధారణమేనంటు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఆమె ప్రేమించిందని..ఘటన జరిగిన రోజున ఆమే అతడిని మొక్కజొన్న చేనుకు పిలిచిందన్నారు.


మొక్కజొన్న చేలు, జొన్న పొలాలు, అడవుల్లో ఇటువంటి ఆవారా యువతులు మరణిస్తూ కనిపించడం సర్వసాధారణమైన విషయమేనని అన్నారు. కనీసం సీబీఐ చార్జిషీటు దాఖలు చేసేంత వరకైనా నిందితులను విడిచిపెట్టాలని కోరారు. నిందితులు నిర్దోషులని తేల్చి చెప్పారు.



బీజేపీ నేత రంజిత్ శ్రీవాస్తవ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. చనిపోయిన ఓ యువతి పట్ల ఏమాత్రం మానవత్వం కూడా లేకుండా ఇటువంటి దారుణమని ..ఆయనకు నోటీసులు పంపిస్తామని కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ చెప్పారు. కాగా.. రంజిత్‌పై ఇప్పటి వరకు 44 క్రిమినల్ కేసులు నమోదుకావటం గమనించాల్సిన విషయం.