Shivling: జ్ఞానవాపి మసీదు అంశంలో పాత తీర్పునే పొడగించిన సుప్రీం కోర్టు

శివలింగం కనిపించిందని తెలిశాక ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకూడదని వారణాసి కోర్టు చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్పందిస్తూ శివలింగం బయటపడ్డ భాగం వరకూ మాత్రమే ఆ ఆదేశం వర్తిస్తుందని యూపీ ప్రభుత్వానికి, పిటిషనర్లకు నోటీసులు ఇష్యూ చేసింది.

Shivling: జ్ఞానవాపి మసీదు అంశంలో పాత తీర్పునే పొడగించిన సుప్రీం కోర్టు

Supreme court extension old order on gyanvapi mosque

Shivling: జ్ఞానవాపి మసీదు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పాత తీర్పునే మరింత కాలం పొడగించింది. గతంలో జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం ఉన్నట్లు తెలిపిన ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కొత్త బెంచ్.. తుది తీర్పు వెలువరించేంత వరకు పాత తీర్పు ప్రకారమే.. శివలింగం ఉన్నట్లు తెలిపిన ప్రాంతాన్ని రక్షించాలని పేర్కొంది.

“అక్కడ శివలింగం ఉన్నట్లయితే, జిల్లా మెజిస్ట్రేట్ దానిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆ కారణంగా ముస్లింలు ప్రార్థన చేసుకునే హక్కుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి” అని సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు చెప్పింది. శివలింగం కనిపించిందని తెలిశాక ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకూడదని వారణాసి కోర్టు చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్పందిస్తూ శివలింగం బయటపడ్డ భాగం వరకూ మాత్రమే ఆ ఆదేశం వర్తిస్తుందని యూపీ ప్రభుత్వానికి, పిటిషనర్లకు నోటీసులు ఇష్యూ చేసింది.

ఈ మసీదు బయటి గోడ వద్ద గల హిందూ దేవతా విగ్రహాలను రోజూ పూజించేందుకు అనుమతించాలన్న అభ్యర్థన సక్రమమేనని వారణాసిలోని జిల్లా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మసీదు కమిటీ, అక్టోబరు 15న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‭లోని శృంగార్ గౌరీ, ఇతర విగ్రహాలను పూజించుకోవడానికి అనుమతించాలని కోరుతూ అయిదుగురు హిందూ మహిళలు కోర్టుకెక్కడంతో వివాదం మొదలైంది. ఇక్కడ సర్వే, వీడియోగ్రఫీ నిర్వహించాలని గత ఏప్రిల్‭లో వారణాసి కోర్టు ఆదేశించింది.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శివలింగానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలన్న హిందూ మహిళల పిటిషన్లను వారణాసి జిల్లా కోర్టు కొద్ది రోజుల క్రితం తోసిపుచ్చింది. కార్బన్ డేటింగ్ లేదా ఏదైనా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించడం వల్ల శివలింగానికి నష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేశ స్పష్టం చేశారు. ఈ అంశంపై అక్టోబరు 11నే విచారణలు ముగియగా, తీర్పును రిజర్వులో ఉంచారు.

Blue Tick: ముందుకు.. వెనక్కి.. మళ్లీ ముందుకు.. బ్లూటిక్‭పై ట్విట్టర్ దోబూచులాట