Supreme Court : పరీక్షల నిర్వహణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీంకోర్టులో 2021, జూన్ 17వ తేదీ గురువారం విచారణ జరిగింది. సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి మార్కులు, 11, 12వ తరగతి యూనిట్ టెస్టుల మార్కుల ఆధారంగా..లెక్కిస్తారని, 13 మంది నిపుణులతో కూడిన కమిటీ సిఫార్సు చేసిందని వెల్లడించారు.

Supreme Court : పరీక్షల నిర్వహణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

State Board Exam

State Board Exams : సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీంకోర్టులో 2021, జూన్ 17వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. మార్కులను లెక్కపెట్టే విధానాన్ని అటార్నీ జనరల్ సుప్రీంకు అందచేశారు. సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి మార్కులు, 11, 12వ తరగతి యూనిట్ టెస్టుల మార్కుల ఆధారంగా..లెక్కిస్తారని, 13 మంది నిపుణులతో కూడిన కమిటీ సిఫార్సు చేసిందని వెల్లడించారు.

జులై 31న ఫలితాలు విడుదల : –
1929 నుంచి సీబీఎస్ఈ బోర్డు ఉందని, ఇన్ని సంవత్సరాల్లో ఈ పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని తెలిపారు. అయితే..మార్కులపై అభ్యంతరాలు ఉంటే..పరిష్కరించే మెకానిజం ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. గత సంవత్సరం కూడా..అనేక మంది మార్కులపై అభ్యంతరాలు చెబుతూ..కోర్టును ఆశ్రయించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది న్యాయస్థానం. దీనిపై అటార్నీ జనరల్ స్పందించారు. ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత విధానంలో లెక్కించిన మార్కులను జులై 31వ తేదీన విడుదల చేస్తామని, ఈ మార్కులపై అభ్యంతరాలు ఉన్న వారు పరీక్షలు నిర్వహించాలని కోరితే..గత సంవత్సరం తరహాలో తర్వాత విడిగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

కోరుకున్న వారికి పరీక్షలు : –
గత ఏడాది కేవలం 10 మంది మాత్రమే పరీక్షలు నిర్వహించాలని కోరడం జరిగిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. కోరుకున్నవారికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండాలని..ఇందుకు ఒక టైమ్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇప్పటికిప్పుడు పరీక్షలు పెట్టాలన్న అభ్యర్థనలు తోసిపుచ్చుతున్నామని స్పష్టమైన వైఖరిని వెలువరించింది. ICSE భిన్నమైన విధానాన్ని ప్రతిపాదించిందని, ఆరు సంవత్సరాల సగటును పరిగణలోకి తీసుకునేలా ప్రతిపాదన ఉందని వెల్లడించింది.

మార్కులపై అభ్యంతరాలకు పరిష్కరించే విధానం : –
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు వెల్లడించిన సుప్రీం…ఏ విద్యార్థి అయినా పరీక్షలకు హాజరవాలని కోరుకుంటే, అందుకు తగిన ఏర్పాట్లు బోర్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బోర్డులు ప్రతిపాదించిన మార్కుల స్కీమ్ లో ఈ రెండు విధానాలు ఉండాలని, మార్కులపై అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించే విధానం ఉండాలని మరోసారి సుప్రీం సూచించింది. టైమ్ లైన్ ఏర్పాటు చేసి ఆలోపు కోరుకున్నవారికి ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఈ స్కీమ్ గురించి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలు నోటిఫై చేయాలని తెలిపింది.

రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు : –
ఇక రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. పరీక్షలను ఇప్పటి వరకు రద్దు చేయాలని పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. 12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు రద్దు చేశాయని, 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే..నాలుగు రాష్ట్రాలు రద్దు చేయలేదనే విషయాన్ని మరోసారి చెప్పింది. కేరళలో 11వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయలేదని, ఈ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.