Vishnu Khatri : వ్యాక్సిన్ వేయించుకుంటే ఫోన్ రీచార్జ్ చేయిస్తా : ఎమ్మెల్యే ఆఫర్

వ్యాక్సిన్ వేయించుకుంటే వారి ఫోన్లకు రీచార్జ్ చేయిస్తాను’అంటూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ఈ వినూత్న ఆఫర్ ప్రకటన చేశారు. గతంలో ఎమ్మెల్యే విష్ణు ఖత్రీ తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి నియోజక వర్గం పరిధిలోని పంచాయతీలకు రూ.20 లక్షలు ప్రకటించారు. ఇప్పుడు ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు.

Vishnu Khatri : వ్యాక్సిన్ వేయించుకుంటే ఫోన్ రీచార్జ్ చేయిస్తా : ఎమ్మెల్యే ఆఫర్

Bjp Mla Vishnu Khatri (1)

MP BJP MLA Vishnu Khatri : కరోనా నుంచి కాపాడుకోవటానికి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని వైద్యనిపుణులు పదే పేదే చెబుతున్నారు.కానీ వ్యాక్సిన్ వచ్చి ఇంత కాలం అవుతున్నా కొన్ని ప్రాంతాల్లో టీకా వేయించుకోవటానికి చాలామంది ముందుకు రావటంలేదు. ఈక్రమంలో పలు ప్రాంతాల్లో పలు ఆఫర్లతో వ్యాక్సిన్ వేయించుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే వినూత్న ఆఫర్ ప్రకటించారు. ‘వ్యాక్సిన్ వేయించుకుంటే వారి ఫోన్లకు రీచార్జ్ చేయిస్తాను’అంటూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ఈ వినూత్న ఆఫర్ ప్రకటించారు. గతంలో ఎమ్మెల్యే విష్ణ ఖత్రీ తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి నియోజక వర్గం పరిధిలోని పంచాయతీలకు రూ.20 లక్షలు ప్రకటించారు. ఇప్పుడు ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు.జూన్ ౩౦ నాటిక‌ల్లా వ్యాక్సిన్ వేయించుకున్న‌ గ్రామస్థుల మొబైల్‌ ఫోన్ల‌కు రీఛార్జ్ చేయిస్తాయనని ప్రకటించారు.

విష్ణు ఖత్రి మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజధాని భోపాల్‌లోని బెర్సియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలోని ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునేలా చేయాలనుకున్నారు. దాని కోసం కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

దీంట్టో భాగంగా తన నియోజకవర్గంలో ఏ పంచాయితీ అయితే వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటుందో ఆ పంచాయితీకి రూ.10 లక్షలు నగదు బహుమానంగా ప్రకటించారు. అలాగే రెండో ర్యాంక్ వచ్చిన పంచాయతీకి రూ. 7 లక్షలు..మూడో ర్యాంక్ పంచాయతీకి రూ. 3 లక్షలు ఇస్తానని ప్రకటించారు. కానీ ప్రజల్లో పెద్దగా కదలిక రాలేదు.దీంతో జనాలంతా ఫోన్ లు ఎక్కువగా వాడుతున్న క్రమంలో రీజార్జ్ చేయించాలనే ఆలోచనతో జూన్ ౩౦ నాటిక‌ల్లా వ్యాక్సిన్ వేయించుకున్న‌ గ్రామస్థుల మొబైల్‌ ఫోన్ల‌కు రీఛార్జ్ చేయిస్తాయనని ప్రకటించారు. మరి ఇప్పటికైనా జనాల్లో మార్పు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారేమో చూడాలి. లేదంటే ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ఇంకే వినూత్న ఆఫర్ ప్రకటిస్తారో మరి..