CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కావేరి ఆస్పత్రిలో చికిత్స..

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 12న స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం విధితమే. గురువారం ఉదయం చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్నకావేరి ఆస్పత్రికి తరలించారు.

CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కావేరి ఆస్పత్రిలో చికిత్స..

Stalin

CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 12న స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం విధితమే. అప్పటి నుంచి ఇంటి వద్దనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే కొవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న స్టాలిన్ ను.. గురువారం ఉదయం చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్నకావేరి ఆస్పత్రికి తరలించారు. స్టాలిన్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచామ‌ని ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Kauverri

తమిళనాడు సీఎం స్టాలిన్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆ రాష్ట్రంలో పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదిలాఉంటే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బుధవారం ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా స్టాలిన్ త్వరగా కోలుకోవాలని, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషిని కొనసాగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ట్వీట్ చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కూడా స్టాలిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “మీరు కొవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని, ప్రజలకు సేవ చేయడానికి త్వరగా తిరిగిరావాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను అని రంగసామి స్టాలిన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.