సమ్మెలో పాల్గొన్నవారి ఉద్యోగాలు పీకేస్తామన్న మంత్రి

  • Published By: venkaiahnaidu ,Published On : October 31, 2019 / 11:56 AM IST
సమ్మెలో పాల్గొన్నవారి ఉద్యోగాలు పీకేస్తామన్న మంత్రి

జీతాలు పెంచాలని,మరింత మంది డాక్టర్లను నియమించాలి,పలు డిమాండ్లతో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు చేస్తున్న నిర‌వ‌ధిక స‌మ్మె ఏడో రోజుకి చేరింది. అయితే డాక్టర్ల సమ్మెపై ఇవాళ(అక్టోబర్-31,2019) స్పందించిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్… సమ్మెలో ఉన్న ప్రభుత్వ డాక్టర్లు ఇవాళ విధులకు హాజరవకపోతే, వారిని డ్యూటీ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు.

ఇప్పటికే కొత్త డాక్టర్ల నియామక ప్రక్రియ ప్రారంభించామన్నారు. సమ్మెలో ఉన్న డాక్టర్లు విధులకు రాకపోతే, త్వరలోనే కొత్తవారు డ్యూటీలో చేరుతారని స్పష్టం చేశారు. శుక్ర‌వారం నుంచి సుమారు 15వేల మంది డాక్ట‌ర్లు స‌మ్మెలో పాల్గొంటున్నారు.  పలు డిమాండ్లతో ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది.