Schools Re-open: స్కూల్, కాలేజీలు ఓపెన్, ఫిబ్రవరి 1నుంచి నో కర్ఫ్యూ

తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. వాటన్నిటినీ రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.

Schools Re-open: స్కూల్, కాలేజీలు ఓపెన్, ఫిబ్రవరి 1నుంచి నో కర్ఫ్యూ

schools open

Schools Re-open: తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. వాటన్నిటినీ రీ ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి నైట్ కర్ఫ్యూ నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం (జనవరి 30) నుంచి పూర్తిగా ఎటువంటి లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేసింది.

జనవరి నెలారంభంలో ఇన్ఫెక్షన్లు పెరిగిపోతుండటంతో స్కూల్స్ ను మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అదే సమయంలో సంక్రాంతి తర్వాత సెకండరీ స్టూడెంట్స్ రావాలని చెప్పినప్పటికీ… ఆ తర్వాత ఎటువంటి తరగతులను నిర్వహించలేదు.

కొత్త రూల్స్ ప్రకారం.. పెళ్లిళ్లకు 100మందికి మించి బంధువులు వద్దని, అంత్యక్రియలకు 50మంది మాత్రమే రావాలని సూచించారు. రెస్టారెంట్లు, సెలూన్లు, సినిమాలు, జిమ్స్, యోగా సెంటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ ఉండాలని చెప్పారు.

Read Also : సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్

ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు నిర్వహించే కల్చరల్, కమ్యూనిటీ ఈవెంట్స్ లాంటి వాటికి అనుమతుల్లేవని కొత్త రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.