DMK : తమిళనాడులో వార్ వన్ సైడ్.. డీఎంకే దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. పదేళ్ల తర్వాత తమిళ రాజకీయాల్లో అధికార మార్పిడి జరగబోతోంది. అక్డక డీఎంకే పార్టీ విజయాన్ని అందుకోబోతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌ లో ఉంది. ఓ వైపు అబ్బాయి ఉదయనిధి గెలుపు దిశగా దూసుకుపోతుంటే మరోవైపు తండ్రి స్టాలిన్ కూడా విక్టరీకి చేరువలో ఉన్నారు. కోలాతూర్‌ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్టాలిన్‌ బరిలోకి దిగారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకు 140 స్థానాల్లో డీఎంకే లీడ్ లో ఉంది. అన్నాడీఎంకే 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

DMK : తమిళనాడులో వార్ వన్ సైడ్.. డీఎంకే దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన స్టాలిన్

Dmk

DMK Stalin : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. పదేళ్ల తర్వాత తమిళ రాజకీయాల్లో అధికార మార్పిడి జరగబోతోంది. అక్డక డీఎంకే పార్టీ విజయాన్ని అందుకోబోతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌ లో ఉంది. ఓ వైపు అబ్బాయి ఉదయనిధి గెలుపు దిశగా దూసుకుపోతుంటే మరోవైపు తండ్రి స్టాలిన్ కూడా విక్టరీకి చేరువలో ఉన్నారు. కోలాతూర్‌ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్టాలిన్‌ బరిలోకి దిగారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకు 140 స్థానాల్లో డీఎంకే లీడ్ లో ఉంది. అన్నాడీఎంకే 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇద్దరు రాజకీయ దురంధరులు, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత లేని ఎన్నికలను తమిళనాడు అసెంబ్లీ ఎదుర్కొంది. ఆ ఇద్దరు నేతల వారసులుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి.. డీఎంకే చీఫ్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల్లో తలపడ్డారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏఐఏడీఎంకే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వైపే మొగ్గు చూపాయి. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఫలితాల్లో దూసుకెళ్తోంది.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల మధ్య ఉన్న ఆధిక్యతలో చెప్పుకో దగ్గ స్థాయిలో తేడా కనిపిస్తోంది. ఏఐఏడీఎంకేతో పోల్చుకుంటే.. సగం స్థానాలకు పైగా డీఎంకే లీడ్‌లో ఉంటోంది. ఇక కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీథి మయ్యం ఏ మాత్రం ప్రభావం చేపలేకపోయింది.

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం(మే 2,2021) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు కూడా వాటితోపాటు వెల్లడి కానున్నాయి.