Gold fish : వలలోపడ్డ బంగారు చేపలు..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు

ఓ మత్య్సకారుడి వలలలో బాంగారు చేపలు పడటంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. 157 బంగారు చేపలుకు ఏకంగా రూ.1.33 కోట్లు దర పలికింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Gold fish : వలలోపడ్డ బంగారు చేపలు..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు

Supreme Court Denies Asaram Bail (2)

Fishermen Sells 157 Highly Sought After Ghol Fish For Rs 1.33 Crore: మత్స్యకారులు గంగమ్మ తల్లినే నమ్ముకుని బతుకుతుంటారు.అరుదైన చేప పడితే వారి పంట పండినట్లే. అందుకే చేపల వేటకు వెళ్లేటప్పుడు గంగమ్మ తల్లీ కరుణించు తల్లీ అని గంగమ్మ తల్లికి మొక్కుకుని నావ ఎక్కుతారు. అలా వెళ్లిన మత్స్యకారులకు వలనిండా చేపలు పడితే వారి పంటపండుతుంది.లేదా అరుదైన చేప ఒక్కటి పడ్డా వారికి కాసుల పంట పండుతుంది.అలా మహారాష్ట్రలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలలో ఓ బంగారు చేప పడింది. అలా ఒక్కటీ రెండూ కాదు ఏకంగా 157 బంగారు చేపలు వలలో పడటంతో మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌కు చెందిన చంద్రకాంత్‌ థారె మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.

మహారాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో కొన్ని రోజులుగా చేపల వేటను నిలిపివేసింది. దీంతో మత్య్సకారులు ఏపనీ లేక రూపాయి సంపాదన లేక అల్లాడిపోయారు.ఈ క్రమంలో చేపల వేటను ఇటీవల ప్రభుత్వం పునఃప్రారంభించింది. చంద్రకాంత్‌ అనే మత్య్సకారుడు తన బృందంతో కలిసి ఆగస్టు 28వ తేదీన సముద్ర తీర ప్రాంతం వద్వాన్‌కు హర్బా దేవీ బోటులో బయలుదేరాడు.

అలా వెళ్లి వెళ్లీ..ఓచోట వల వేశారు. తరువాత వలలు లాగారు. వలలు బరువుగా ఉండటంతో చేపలు బాగానే పడి ఉంటాయని చంద్రకాంత్ సంతోషపడిపోయారు. అలా వలలను లాగారు. అంతే చంద్రకాంత్ బృందం కళ్లు బంగారం కాంతితో మిలమిలా మెరిసిపోయాయి. ఎందుకంటే వలల్లో బంగారు చేపలు పడ్డాయి. సముద్రపు బంగారంగా పిలిచే అత్యంత అరుదుగా లభించే చేపలు ‘గోల్‌ ఫిష్‌’ లు భారీగా పడ్డాయి. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 157 చేపలు పడడంతో సంబరపడిపోతూ వాటిని తీసుకుని వచ్చాడు. మార్కెట్‌కు తీసుకెళ్లగా ఆ చేపలకు విపరీతమైన డిమాండ్‌ వచ్చి పడింది.

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌కు చెందిన వ్యాపారస్తులు ఆ చేపలను ఏకంగా 1.33 కోట్లకు కొనేసరికి చంద్రకాంత్ తో కోటీశ్వరుడు అయిపోయాడు. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడితో పాటుఅతని బృందానికి కూడా భారీగా డబ్బులు ముట్టాయి. ఒక్కో చేప విలువ రూ.85 వేల దాకా పలికింది. ఆ చేపల ప్రత్యేకత ఏమిటంటే..గోల్‌ ఫిష్‌ చేప శాస్త్రీయ నామం ‘ప్రొటనిబి డయాకాంతస్‌’. ఈ చేపకు హంకాంగ్‌, మలేసియా, థాయిలాండ్‌, ఇండోనేసియా, సింగపూర్‌, జపాన్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. చాలా అరుదుగా లభించే ఈ చేపను పరిశోధనలకు వినియోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చేప. ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆ చేపలు అంతగా లభించడం లేదు. కానీ మహారాష్ట్ర మత్య్సకారుల పంట పండి బంగారు పంటే పడింది.