భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు : ఆగిన వివాహం

భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఓ జంట వివాహం ఆగిపోయింది. 

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు : ఆగిన వివాహం

Tensions Between India And Pakistan Stop Marriage

భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఓ జంట వివాహం ఆగిపోయింది.

జైపూర్‌ : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో సీమాంతర వివాహాలు సర్వసాధారణం. రాజ్‌పుత్‌, మెగవాల్‌, బీల్‌, సింధి, కాత్రి కమ్యూనిటీలు ఈ తరహా పెళ్లిలు చేసుకుంటాయి. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఓ జంట వివాహం ఆగిపోయింది.
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

రాజస్థాన్‌లోని బర్మార్‌ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు, పాకిస్తాన్‌ సింధ్‌ ప్రావిన్స్‌లోని అమర్‌ కోట్‌ జిల్లాకు చెందిన చగన్‌ కర్వార్‌కు మార్చి 8న వివాహం జరగాల్సివుంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందడంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే వివాహం జరిపిస్తామని తెలిపారు.

ఈ మేరకు వరుడు మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ గత నెలలోనే తమ పెళ్లి నిశ్చయించారని, పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచామని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ నుంచి వీసాలు కూడా తీసుకున్నామని… అక్కడికి వెళ్లేందుకు థార్‌ ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు బుక్‌ చేశామని తెలిపారు. కానీ ఇప్పుడు తమ పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చామని.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం