Uttar Pradesh : రూ.2,100 లెక్కించలేక పోయిన వరుడు.. కోపంతో వధువు కీలక నిర్ణయం..

యూపీలోని ఫరూఖాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరుడు  2100 నగదును లెక్కించలేక పోయాడు. విషయం తెలుసుకున్న వధువు కోపంతో ఊగిపోయింది. తనకు ఈ వరుడు వద్దంటూ వెళ్లిపోయింది. వధువు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు సమస్య పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

Uttar Pradesh : రూ.2,100 లెక్కించలేక పోయిన వరుడు.. కోపంతో వధువు కీలక నిర్ణయం..

cancel wedding

Uttar Pradesh : యూపీలోని ఫరూఖాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరుడు  2100 నగదును లెక్కించలేక పోయాడు. విషయం తెలుసుకున్న వధువు కోపంతో ఊగిపోయింది. తనకు ఈ వరుడు వద్దంటూ వెళ్లిపోయింది. వధువు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు సమస్య పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. వరుడు నిరక్షరాస్యుడు కావటంవల్లనే పెళ్లికి నిరాకరించినట్లు యువతి పేర్కొంది. వధువు నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులుసైతం అంగీకారం తెలపడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Uttar Pradesh: మతం మార్చుకోలేదని భర్త ఘాతుకం.. భార్యపై శారీరక వేధింపులు

దుర్గుపూర్ గ్రామానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం మైన్‌పురి పోలీస్ స్టేషన్ బిచ్మాలోని బబినాసారా గ్రామంలో నివసిస్తున్న యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 20న రాత్రి పెళ్లివేడుక జరగాల్సి ఉంది. దీంతో అదేరోజు సాయంత్రం ఊరేగింపుగా అనంతరం, రాత్రి 1గంట ప్రాంతంలో ద్వారచర్ల వేడుక ప్రారంభమైంది. స్థానిక సమాచారంతో వరుడు నిరక్ష్యరాస్యుడని వధువు సోదరి అనుమానించింది. సోదరుడికి రూ.2100 ఇచ్చి వరుడికి ఇవ్వాలని, వాటిని లెక్కించాలని సూచించాలని చెప్పింది. దీంతో వధువు సోదరుడు వరుడు వద్దకు వెళ్లి రూ. 2100 ఇచ్చి లెక్కించాలని సూచించారు. నిరక్షరాస్యుడు కావడంతో ఆ డబ్బును వరుడు లెక్కించలేకపోయాడు.

VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

వరుడు నిరక్షరాస్యుడనే విషయం తెలుసుకున్న వధువు పెళ్లికి నిరాకరించింది. ఇందుకు వధువు కుటుంబ సభ్యులు అడ్డుచెప్పడంతో.. ఇది తన జీవితానికి సంబంధించిన విషయమని తేల్చిచెప్పి పెళ్లి వేడుక నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో వధువు కుటుంబ సభ్యులుసైతం పెళ్లికి నిరాకరించారు. వివాదంకాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. తన కుమార్తె ఉన్నత చదువులు చదివిందని, నిరక్షరాస్యుడికి ఇచ్చి వివాహం చేసేది లేదని యువతి తల్లి తేల్చిచెప్పింది. పోలీసులుసైతం వధువు నిర్ణయానికి మద్దతు నిలవడంతో ఇరుకుటుంబాల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.