Mamata Banerjee: అవసరమైతే నా రక్తాన్ని చిందిస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రక్తాన్ని అయినా చిందించేందుకు తాను సిద్ధమని, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించేందుకు మాత్రం నేను ఒప్పుకోనని అన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee: అవసరమైతే నా రక్తాన్ని చిందిస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

Mamata

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రక్తాన్ని అయినా చిందించేందుకు తాను సిద్ధమని, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించేందుకు మాత్రం నేను ఒప్పుకోనని అన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు భాజపా నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఉద్యమాన్నిసైతం నిర్వహిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో మమత బెనర్జీ బీజేపీ నాయకుల డిమాండ్ పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Mamata Banerjee: బీజేపీకి 2024లో నో ఎంట్రీ: మమతా బెనర్జీ

బీజేపీ కావాలనే రాష్ట్రంలోని ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ వేర్పాటు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. ఉత్తర బెంగాల్ లోని అన్నివర్గాల ప్రజలు దశాబ్దాల పాటు సామరస్యతతో జీవిస్తున్నారని దీదీ పేర్కొన్నారు. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పబ్బంగడుపుకోవటం కోసం రాష్ట్ర విభజన డిమాండ్లు తెరపైకి తెస్తోందని, కొన్నిసార్లు గుర్ఖాలాండ్, మరికొన్ని సార్లు నార్త్ బెంగాల్ అంటూ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దీదీ మండిపడ్డారు. కొందరు వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారు. అలాంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాంటి వారి బెదిరింపులకు నేను అస్సలే భయపడను అంటూ మమత స్పష్టం చేశారు.