National
Goat Gave Birth : మనిషి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక
సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.
సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.
Updated On - 11:20 am, Fri, 9 April 21
Worshipped Like God : ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు జరుగుతుంటాయి. ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయి. చిత్రవిచిత్రమైన రీతిలో, ఎవరూ నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. వింత వింత ఆకారంలో జన్మిస్తుంటారు. ఇందులో జంతువులు కూడా ఉంటాయి. ఇలాగే..ఓ వింత చోటు చేసుకుంది. మనిషి ఆకారంతో ఉన్న వింత జీవికి మేక జన్మనిచ్చినట్లు వార్తు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వింత జీవిని చూసేందుక జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దేవుడి ప్రతిరూపం అంటూ..పూజలు చేస్తున్నారు. అయితే..ఈ వింత జీవి కొద్దిసేపు మాత్రమే జీవించి ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే అతడి ఇంట్లో మేక ప్రసవించింది. ఆ మేక వింత జీవికి జన్మనివ్వడంతో అజయ్ ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గ్రామమంతా పాకింది. ఇంకేముంది…అతడి ఇంటికి క్యూ కట్టారు. మనిషి ముఖాన్ని పోలి ఉండడంతో ఆ వింత జీవికి పూజలు చేయడం ప్రారంభించారు. మేకలకు ఉండే తోక దీనికి లేకపోవడం గమనార్హం. మనిషికి ఉన్నట్లుగానే..ముఖం, ముక్కు, నోరు ఉన్నాయి. నాలుగు కాళ్లు కూడా ఉన్నాయి. పది నిమిషాల పాటే జీవించిన ఈ వింత జీవి చనిపోవడంతో దానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
#WATCH | Baby goat born with a human face is being worshipped like God; pics and videos go #Viral!#goat pic.twitter.com/nGEgYEKjfE
— Zee News English (@ZeeNewsEnglish) April 9, 2021
Read More : Maharashtra Migrants: లాక్‌డౌన్ మొదలైంది.. వలసదారుల తిప్పలు షురూ
Woman molested : కీచక మామ.. కోడలిపై అత్యాచార యత్నం
Viral: వింత జంతువని ఫోన్ చేసిన మహిళ.. తీరా అక్కడకి వెళ్లి చూస్తే..
World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..
11 days baby corona : పుట్టిన ఐదు రోజులకే కరోనా..11రోజుల పసిబిడ్డకు ప్లాజ్మా చికిత్స
Viral wedding: ఒంటి నిండా గాయాలతో పెళ్లి చేసుకున్న యువకుడు.. ఏమైందంటే?
Gujarat : చెత్త లారీలో వెంటిలేటర్ల తరలింపు