JEE Advanced – 2021 : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తులు

ఐఐటీలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2021 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.

10TV Telugu News

online application for JEE Advanced : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2021 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది. అయితే దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావాల్సివుంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్‌–2021 ఫలితాలు వెలువడకపోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజును సెప్టెంబర్‌ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు అడ్మిట్‌ కార్డులు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష అక్టోబర్‌ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌–1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటుంది.

Swayam Prabha: ఫీజు లేకుండా.. అరచేతిలో ఐఐటీ పాఠాలు!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021 పరీక్ష జూలై 3న నిర్వహించాల్సివుండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్‌3వ తేదీకి వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్‌ షీట్లు అక్టోబర్‌ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్‌ 10న ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్‌ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు.

ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్‌ 15, 16వ తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్‌ 18న జరుగనుంది. ఏఏటీ ఫలితాలను అక్టోబర్‌ 22న విడుదల చేయనున్నారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానుంది.

జేఈఈ మెయిన్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో మెరిట్‌ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు అయ్యారు. సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్‌ ఫలితాలు వెలువడే అవకాశముంది.

10TV Telugu News