Goat Milk : అక్కడ లీటర్ మేక పాల ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మధ్యప్రదేశ్ లో ఆవు, గేదె పాల కంటే మేక పాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఛత్తర్ పుర్ జిల్లాలో మేక పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ మేకపాలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.400కు చేరింది.

10TV Telugu News

price of a liter of goat milk : మధ్యప్రదేశ్ లో ఆవు, గేదె పాల కంటే మేక పాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఛత్తర్ పుర్ జిల్లాలో మేక పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ.30 నుంచి రూ.40లకు లభించే లీటర్ మేకపాలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.400కు పెరిగింది.

రాష్ట్రంలో భారీగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. అందులోనూ చత్తర్ పూర్ జిల్లా సహా సమీప జిల్లాల్లో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. మేక పాలు తాగితే డెంగీ నయం అవుతుందని స్థానికులు భావిస్తున్నారు.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

ఈ క్రమంలో మేక పాలకు భారీగా డిమాండ్ పెరిగింది. మేక పాలు తాగడం డెంగీ రోగులకు ఉపయోగకరమే కానీ దాని వల్ల జబ్బు నయం కాదని స్థానిక వైద్యులు తెలిపారు. అది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.