SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

స్పైస్‌జెట్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

SpiceJet plane

SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళ్తోన్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

స్పైస్ జెట్ కు చెందిన B737-8 మ్యాక్స్ విమానం 197 మంది ప్రయానికులతోపాటు ఆరుగురు సిబ్బందితో సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళ్తోంది. ఈ క్రమంలో విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో పైలట్ విమానాశ్రయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Smoke In Spicejet Flight : స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం

దీంతో విమానాన్ని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.