Bihar Road Accident : బీహార్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు చిన్నారులతో సహా 8మంది మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదాచారులపైకి ట్రక్కు దూసుకురావటంతో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Bihar Road Accident : బీహార్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు చిన్నారులతో సహా 8మంది మృతి

Road Accident

Bihar Road Accident :బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదాచారులపైకి ట్రక్కు దూసుకురావటంతో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వైశాలి జిల్లా దేశారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్-మహనార్ ప్రధాన రహదారిపై జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది.

Actress Aindrila Sharma Dies : సినీ పరిశ్రమలో మరో విషాదం.. 24ఏళ్లకే గుండెపోటుతో యువ నటి మృతి

స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. ట్రక్కు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. అకస్మాత్తుగా ట్రక్కు రోడ్డుదిగి జనంపైకి దూసుకొచ్చి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 20 నుంచి 30 కి.మీ.గా నిర్ణయించినప్పటికీ ట్రక్కు దాదాపు 60 కి.మీ వేగంతో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. వీరిలో 12ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. వర్ష కుమారి(8), సురుచి కుమారి (12), అనుష్క కుమారి (8), శివాని (8), ఖుషీ కుమారి (10), చందన్ కుమార్ (20), కోమల్ కుమారి (10), సతీష్ కుమార్ (17) మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో సురుచి కుమారి (8), అంజలి కుమారి (6), సౌరభ్ కుమార్ (17), మరో 50 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాద సమయంలో సతీష్ కుమార్ (17) అనే యువకుడి మృతదేహం ట్రక్కు ముందు బంపర్‌లో ఇరుక్కుపోయింది. డ్రైవర్‌ కూడా క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అర్థరాత్రి గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి వీరిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.