Theft : ఐఏఎస్ అధికారుల ఇళ్లలో దొంగతనాలు

ఇన్నతాధికారుల ఇళ్లను టార్గెట్ గా చేసుకొని దోచుకుంటున్న ఘరానా దొంగను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరణ్ అలియాస్ సందీప్ అనే వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ తోపాటు వీఐపీలు, వీవీఐపీల ఇళ్లను గుర్తించి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకొని వెళ్ళేవాడు.

Theft : ఐఏఎస్ అధికారుల ఇళ్లలో దొంగతనాలు

Theft

Theft : ఇన్నతాధికారుల ఇళ్లను టార్గెట్ గా చేసుకొని దోచుకుంటున్న ఘరానా దొంగను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరణ్ అలియాస్ సందీప్ అనే వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ తోపాటు వీఐపీలు, వీవీఐపీల ఇళ్లను గుర్తించి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకొని వెళ్ళేవాడు.

ఇతడిని పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. 9 మంది ఉన్నతాధికారుల ఇళ్లలో దొంగతనాలు చేశాడు. మరికొందరు వీఐపీల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. తాజాగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలోని రవీంద్ర నగర్, పండారా రోడ్ లోని నివాసాలలో వేర్వేరు రోజులలో దొంగతనాలు జరిగాయి. దీంతో నిఘా పెంచిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపాడు. అతడిపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన వస్తువులను రికవరీ చేస్తున్నట్లు తెలిపారు.