Corona India : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజే 37,379 పాజిటివ్ కేసులు

దేశంలో ప్రస్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,82,017 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Corona India : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజే 37,379 పాజిటివ్ కేసులు

Corona 11zon

new corona cases in India : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 124 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,82,017 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,42,95,407 మంది బాధితులు కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 1,45,68,89,304 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Corona : దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌

కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్‌ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌ వేరియంట్‌వే అని చెప్పారు.

మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 192 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కేరళలో ఉన్నాయి.